Bigg Boss : బిగ్‌బాస్ లోకి బన్నీ.. పీక్స్‌లో ‘పుష్ప’ ప్రమోషన్స్

ప్రస్తుతం అల్లుఅర్జున్ ఈ సినిమా ప్రమోషన్స్ పై ఫోకస్ పెట్టాడు. ఎలాగైనా ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోవాలని ఫిక్స్ అయ్యాడు బన్నీ. అందుకే ఇటీవల ......

Bigg Boss : బిగ్‌బాస్ లోకి బన్నీ.. పీక్స్‌లో ‘పుష్ప’ ప్రమోషన్స్

Pushpa

Bigg Boss :  అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో రాబోతున్న మూడో సినిమా ‘పుష్ప’. ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారాలనుకుంటున్నాడు ఐకాన్ స్టార్. తెలుగుతో పాటు తమిళ్ , కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్, టీజర్ తో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సినిమాని ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 17న రిలీజ్ చేస్తున్నట్టు ఇటీవల ప్రకటించారు. ఈ సినిమా ట్రైలర్ ని డిసెంబర్ 6న విడుదల చేయనున్నారు.

Puneeth Rajkumar : 22 ఏళ్ళ వివాహ బంధం.. ఇకపై పునీత్ జ్ఞాపకాల్లోనే

ప్రస్తుతం అల్లుఅర్జున్ ఈ సినిమా ప్రమోషన్స్ పై ఫోకస్ పెట్టాడు. ఎలాగైనా ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోవాలని ఫిక్స్ అయ్యాడు బన్నీ. అందుకే ఇటీవల సినిమా ఫంక్షన్స్ కి, టీవీ షోలకి, టీజర్, ట్రైలర్ లాంచింగ్స్ కి వెళ్తున్నాడు. ఇదంతా ‘పుష్ప’ సినిమా ప్రమోషన్స్ లో భాగమే అని సమాచారం. తాజాగా హిందీలో కూడా ఈ సినిమాని ప్రమోట్ చేయడానికి బన్నీనే డైరెక్ట్ గా రంగంలోకి దిగుతున్నట్టు వినిపిస్తుంది.

Salman Khan : చిరంజీవి, వెంకటేష్ సినిమాల్లో నటించబోతున్నాను : సల్మాన్ ఖాన్

‘పుష్ప’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హిందీ బిగ్ బాస్ సీజన్ 15లో అల్లు అర్జున్ గెస్ట్ గా వెళ్లే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. సల్మాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమంలో పాల్గొంటే ‘పుష్ప’కి బాలీవుడ్ లో మంచి ప్రమోషన్ అవుతుందని బన్నీ భావిస్తున్నాడు. ఐకాన్ స్టార్ త్వరలోనే ఈ షోలో పాల్గొనబోతున్నాడని బాలీవుడ్ సమాచారం. నిన్న ‘అంతిమ్’ సినిమా థ్యాంక్స్ మీట్ సందర్భంగా సల్మాన్ హైదరాబాద్ కి రావడంతో అల్లు అర్జున్ ఈ విషయం గురించి మాట్లాడినట్టు తెలుస్తుంది. ఇదే నిజమయితే బన్నీకి హిందీలో మంచి ప్రమోషన్ దొరికినట్టే.