Bunny Vasu : ఈ పాటకి రీల్ చేయండి.. పుష్ప 2 షూటింగ్ చూసే ఛాన్స్ గెలుచుకోండి..

వినరో భాగ్యము విష్ణు కథ సినిమా సెకండ్ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ.. ఈ సాంగ్ ని రీల్స్ గా చేసి సోషల్ మీడియాలో గీత ఆర్ట్స్ ని ట్యాగ్ చేయండి. బాగా చేసిన 10 మందిని సెలెక్ట్ చేసి..............

Bunny Vasu : ఈ పాటకి రీల్ చేయండి.. పుష్ప 2 షూటింగ్ చూసే ఛాన్స్ గెలుచుకోండి..

Bunny Vasu announced a offer for watching pushpa 2 shooting

Bunny Vasu :  యువ హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ కశ్మీర పరదేశి జంటగా నటిస్తున్న సినిమా ‘వినరో భాగ్యము విష్ణు కథ’. అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మాణంలో కొత్త డైరెక్టర్ ముర‌ళి కిషోర్ అబ్బురు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సినిమాని ఫిబ్రవరి 17న థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నారు. దీంతో చిత్రయూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు.

తాజాగా వినరో భాగ్యము విష్ణు కథ సినిమా నుంచి రెండో పాటని VVIT కాలేజీ గుంటూరులో రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆ కాలేజీ టీంతో చిత్రయూనిట్ క్రికెట్ ఆడారు. ఆ మ్యాచ్ లో బాగా ఆడిన ఓ వ్యక్తితో.. ఓ బంగారం నీ చెయ్యి తాకగానే ఉప్పొంగిపోయిందే నా ప్రాణం అనే పాటని రిలీజ్ చేయించారు. అయితే ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ ఓ ఆసక్తికర విషయాన్ని ప్రకటించాడు.

Shubra Aiyappa : 150 ఏళ్ళ నాటి ఇంట్లో పెళ్లి చేసుకున్న హీరోయిన్..

వినరో భాగ్యము విష్ణు కథ సినిమా సెకండ్ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ.. ఈ సాంగ్ ని రీల్స్ గా చేసి సోషల్ మీడియాలో గీత ఆర్ట్స్ ని ట్యాగ్ చేయండి. బాగా చేసిన 10 మందిని సెలెక్ట్ చేసి వారికి, వారి ఫ్యామిలీకి ఈ సినిమాని ఫ్రీగా చూపిస్తాము. అంతే కాకుండా పుష్ప 2 షూటింగ్ కూడా చూసే ఛాన్స్ కలిపిస్తాము అని ప్రకటించారు. దీంతో బన్నీ అభిమానులు, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేసే వాళ్లంతా సంతోషం వ్యక్తం చేసి ఈ పాటకి రీల్స్ చేసే పనిలో పడ్డారు. మరి ఈ సాంగ్ రీల్ తో పుష్ప 2 షూటింగ్ ని చూసే ఛాన్స్ ఎవరు దక్కించుకుంటారో చూడాలి.