Allu Arjun : అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాల అప్డేట్స్ ఇచ్చిన బన్నీ వాసు.. పుష్ప 2 రిలీజ్ ఎప్పుడో తెలుసా?

తాజాగా అల్లు అర్జున్ ఫ్రెండ్, నిర్మాత బన్నీ వాసు పుష్ప 2 సినిమా అప్డేట్ ఇస్తూ, బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి కూడా తెలిపారు.

Allu Arjun : అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాల అప్డేట్స్ ఇచ్చిన బన్నీ వాసు.. పుష్ప 2 రిలీజ్ ఎప్పుడో తెలుసా?

Bunny Vasu gives clarity on Allu Arjun next movies

Bunny Vasu : పుష్ప(Pushpa) సినిమాతో అల్లు అర్జున్(Allu Arjun) ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. పుష్ప సినిమా బాలీవుడ్(Bollywood) లో భారీ విజయం సాధించడంతో ఐకాన్ స్టార్ క్రేజ్ నార్త్ లో కూడా పెరిగింది. దీంతో దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ అభిమానులే కాకుండా సినీ ప్రేక్షకులు పుష్ప 2 సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. పుష్ప రిలీజయిన సంవత్సరానికి గట్టిగా ప్లాన్ చేసుకొని పుష్ప 2 మొదలుపెట్టారు సుకుమార్.

ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే పుష్ప 2 నుంచి రిలీజ్ చేసిన గ్లింప్స్, ఫస్ట్ లుక్ తో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. దీంతో ఈ సినిమా ఎప్పుడు రిలీజవుతుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. తాజాగా అల్లు అర్జున్ ఫ్రెండ్, నిర్మాత బన్నీ వాసు పుష్ప 2 సినిమా అప్డేట్ ఇస్తూ, బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి కూడా తెలిపారు.

Brahmanandam Son Engagement : బ్రహ్మానందం రెండో తనయుడి నిశ్చితార్థం ఫొటోలు.. బ్రహ్మానందం చిన్న కోడలిని చూశారా?

మలయాళంలో సూపర్ హిట్ అయిన 2018 సినిమాని బన్నీ వాసు తెలుగులో రిలీజ్ చేస్తున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బన్నీ వాసు మాట్లాడుతూ.. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్ లో ఉన్నారు. ఆ సినిమా ఈ సంవత్సరం డిసెంబర్ లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు చిత్రయూనిట్. ఆ తర్వాత గీత ఆర్ట్స్ లోనే అల్లు అర్జున్ ఒక సినిమా చేస్తారు. షారుఖ్ ఖాన్ జవాన్ లో అల్లు అర్జున్ చెయ్యట్లేదు. బాలీవుడ్ నుంచి ఆఫర్స్ వస్తున్నాయి. ఇటీవల ది ఇమ్మోర్టల్ ఆఫ్ అశ్వత్థామ సినిమా యూనిట్ అల్లు అర్జున్ ని సంప్రదించింది. వాళ్లకు ఇంకా ఓకే చెప్పలేదు. కానీ బన్నీ ఈ సినిమా చేయాలనుకుంటున్నాడు అని తెలిపారు.