Bunny Vasu : ఇండస్ట్రీలో కూడా తప్పులున్నాయి : బన్నీ వాసు

ఇటీవల ఏపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ సినీ పరిశ్రమ కష్టాలని ఎత్తి చూపుతూ వ్యాఖ్యలు చేశారు. వాటికి రాజకీయ నాయకులు కౌంటర్లు ఇచ్చారు. కానీ సినీ పరిశ్రమ పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా ఏపీ

Bunny Vasu : ఇండస్ట్రీలో కూడా తప్పులున్నాయి : బన్నీ వాసు

Bunny Vasu

Bunny Vasu :  ఇటీవల ఏపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ సినీ పరిశ్రమ కష్టాలని ఎత్తి చూపుతూ వ్యాఖ్యలు చేశారు. వాటికి రాజకీయ నాయకులు కౌంటర్లు ఇచ్చారు. కానీ సినీ పరిశ్రమ పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వాన్ని సమర్ధించడం విశేషం. సినీ ప్రముఖులు పవన్ కళ్యాణ్ తీరుని తప్పు పట్టారు. టికెట్ రేట్ల విషయం, ఆన్లైన్ టికెట్ విధానం, 100 శాతం ఆక్యుపెన్సీ ఇలా ప్రభుత్వం సరిగా చర్యలు తీసుకోవట్లేదు అంటూ ప్రశ్నించారు పవన్. కానీ సినీ ప్రముఖులు ప్రభుత్వం వాటన్నిటిని పరిష్కరిస్తుంది అని తెలిపి ప్రభుత్వం చెప్పిన వాటికి మద్దతు ఇస్తున్నారు. ఈ సారి ఏకంగా ఇండస్ట్రీలో తప్పులున్నాయి, థియేటర్ వ్యవస్థలో తప్పులున్నాయి అంటూ ప్రముఖ నిర్మాత బన్నీ వాసు వ్యాఖ్యానించారు.

Hyper Aadi : 25 నిమిషాలకి అదిరిపోయే రెమ్యునరేషన్ తీసుకున్న హైపర్ ఆది

అఖిల్ హీరోగా రాబోతున్న సినిమా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. ఈ సినిమా నిర్మాత బన్నీ వాసు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బన్నీ వాసు మీడియాతో మాట్లాడుతూ .. థియేటర్స్‌ పరిశ్రమలో ఏపీలో నెలకొన్న టికెట్‌ రేట్స్‌, సెకండ్‌ షో లాంటి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఏపీ ఎగ్జిబిటర్లు సరిగ్గా పన్నులు కట్టడం లేదు. ఏపీలో దాదాపు రెండు, మూడు వందల థియేటర్స్‌ జీఎస్‌టీ పరిధిలో లేవు. దానివల్ల ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతుంది. థియేటర్స్‌ వ్యవస్థలో పారదర్శకత ఉండాలనే ఏపీ ప్రభుత్వం ఆన్‌లైన్‌ విధానాన్ని ప్రవేశపెడుతుంది. దీన్ని కొందరు సినిమా వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. బుకింగ్‌ కౌంటర్స్‌ ఎత్తివేసి థియేటర్స్‌ ద్వారా వచ్చే రెవెన్యూను ప్రభుత్వం దోచుకుంటుందని అంటున్నారు కానీ అందులో నిజం లేదు. తెలంగాణలో థియేటర్స్‌ అన్ని సిస్టమాటిక్‌గా నడుస్తున్నాయి. పన్నులను సరిగా చెల్లిస్తున్నాయి. ఏపీలో మాత్రం థియేటర్స్‌ రెవెన్యూకు వారు ప్రభుత్వానికి కట్టే పన్నులకు చాలా తేడాలున్నాయి. థియేటర్స్‌ థర్డ్‌ పార్టీల చేతుల్లో ఉండటం వల్ల ఈ సమస్యలు వస్తున్నాయి. ఇండస్ట్రీవైపు ఉన్న ఇలాంటి తప్పులను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. త్వరలోనే ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి అని మీడియాకి తెలిపారు బన్నీ వాసు.