వీడికి రెండు బ్రెయిన్లు: బుర్రకథ టీజర్

టీజర్ చూస్తుంటే ఆదికి బుర్రకథ బ్రేక్ ఇచ్చేలానే ఉంది అనిపిస్తుంది..

  • Edited By: sekhar , May 6, 2019 / 05:14 AM IST
వీడికి రెండు బ్రెయిన్లు: బుర్రకథ టీజర్

టీజర్ చూస్తుంటే ఆదికి బుర్రకథ బ్రేక్ ఇచ్చేలానే ఉంది అనిపిస్తుంది..

ఆది సాయికుమార్, మిస్తీ చక్రవర్తి, నైరా షా హీరో, హీరోయిన్స్‌గా, రైటర్ డైమండ్ రత్నబాబుని డైరెక్టర్‌గా పరిచయం చేస్తూ, దీపాల ఆర్ట్స్ బ్యానర్‌పై, హెచ్.కె.శ్రీకాంత్ దీపాల, కిషోర్ నిర్మిస్తున్న సినిమా.. బుర్రకథ.. రీసెంట్‌గా ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది. ‘సంధ్యావందనంలో సంధ్యుంది’, ‘చదివే వేదాల్లో వేదుంది’, ‘ఏసే పద్మాసనంలో పద్ముంది’, ‘మరి మీ లైఫ్‌లో ఏముంది’? అంటూ.. ఆది చెప్పే డైలాగ్‌తో స్టార్ట్ అయిన టీజర్.. చాలా ఫన్నీగా ఉంది. ఆది రకరకాల గెటప్స్‌లో కనిపించాడు. అతని మేకోవర్ బాగుంది.

ఆది తండ్రిగా రాజేంద్ర ప్రసాద్, డాక్టర్‌గా పోసాని నవ్వుల పువ్వులు పూయించనున్నారని అర్ధమవుతుంది. టీజర్ చివర్లో, ‘ఇంకేమింకేంమింకేం కావాలే’.. అని ఆది పాడితే, 30 ఇయర్స్ పృథ్వీ.. ‘ఒక ఇత్తడి చెంబు, ఒక వెండి కంచం, ఒక బంగారు మొలతాడు, ఒక కరీంబీడి కట్ట’ అంటూ, జంబలకిడి పంబలో బ్రహ్మానందంలా చెప్పడం అయితే కెవ్వుకేక అని చెప్పాలి. సి.రామ్ ప్రసాద్ విజువల్స్, సాయి కార్తీక్ ఆర్ఆర్ బాగున్నాయి. టీజర్ చూస్తుంటే ఆదికి బుర్రకథ బ్రేక్ ఇచ్చేలానే ఉంది అనిపిస్తుంది. ఈ సినిమాకి ఎడిటింగ్ : ఎమ్ఆర్ వర్మ, ఆర్ట్ : చిన్నా.

వాచ్ బుర్రకథ టీజర్..