Telugu Star Hero’s: స్టార్ హీరోల బిజీ షెడ్యూల్స్.. ఒకటి కాగానే మరొకటి సెట్స్ మీదకి!

కోవిడ్ వల్ల సరిగా షూటింగ్స్ జరక్కపోవడంతో.. ఆ గ్యాప్ ని ఫిల్ చేసుకోవడానికి అసలు బ్రేక్ లేకుండా సినిమాలు చేస్తున్నారు మన స్టార్లు. ఆల్రెడీ పెండింగ్ లో ఉన్న సినిమాలు..

Telugu Star Hero’s: స్టార్ హీరోల బిజీ షెడ్యూల్స్.. ఒకటి కాగానే మరొకటి సెట్స్ మీదకి!

Telugu Star Hero's

Telugu Star Hero’s: కోవిడ్ వల్ల సరిగా షూటింగ్స్ జరక్కపోవడంతో.. ఆ గ్యాప్ ని ఫిల్ చేసుకోవడానికి అసలు బ్రేక్ లేకుండా సినిమాలు చేస్తున్నారు మన స్టార్లు. ఆల్రెడీ పెండింగ్ లో ఉన్న సినిమాలు లాస్ట్ స్టేజ్ కి రావడంతో నెక్ట్స్ ప్రాజెక్ట్స్ కి వెళ్లడానికి రెడీ అవుతున్నారు హీరోలు. టాలీవుడ్ స్టార్లందరూ సినిమా షూటింగ్స్ ని ఫినిష్ చేసే పనిలో ఫుల్ బిజీగా ఉన్నారు. అంతేకాదు ఉన్న సినిమాల్ని కంప్లీట్ చేసి నెక్ట్స్ ప్రాజెక్ట్స్ కి షిఫ్ట్ అవ్వడానికి ఇప్పటినుంచే ప్లాన్ చేస్తున్నారు.

Annaatthe: సిద్ శ్రీరామ్, శ్రేయ ఘోషల్.. ‘అన్నాత్తై’ నుండి మంచి మెలోడీ

లేటెస్ట్ గా స్విడ్జర్లాండ్ లో సర్కారు వారి పాట షూటింగ్ కి వెళ్లిన సూపర్ స్టార్.. నవంబర్ రెండో వారానికి ఈ సినిమాని కంప్లీట్ చేసి ఏమాత్రం బ్రేక్ తీసుకోకుండా.. వెంటనే త్రివిక్రమ్ తో తెరకెక్కబోతున్న సినిమాకి షిఫ్ట్ అవుతున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా నెక్ట్స్ సినిమాకి షిఫ్ట్ అవ్వడానికి ప్లాన్ చేసుకున్నాడు. భీమ్లా నాయక్ షూటింగ్ ని ఈ నెలాఖరుకి ఫినిష్ చేసేలా షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్న పవర్ స్టార్.. ఈ సినిమా అయిపోగానే హరిహరవీరమల్లు కి షిఫ్ట్ అవ్వబోతున్నాడు. ఆల్రెడీ 50 పర్సెంట్ అయిపోయిన హరిహరవీరమల్లు సినిమాని నెక్ట్స్ మన్త్ నుంచి రీస్టార్ట్ చేస్తున్నారు.

RRR: నిర్మాతల సంప్రదింపులు.. ఆర్ఆర్ఆర్ డేట్ మారుతుందా?

ఇక ఆర్ఆర్ఆర్, ఆచార్య రెండు సినిమాల్ని కంప్లీట్ చేసి నెక్ట్స్ సినిమా షూటింగ్ కోసం వెయిట్ చేస్తున్న చరణ్.. స్టార్ డైరెక్టర్ శంకర్ తో సినిమాకు సంబందించి నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చెయ్యాలని డిసైడ్ అయ్యాడు. సీనియర్ హీరో బాలకృష్ణ అఖండని కంప్లీట్ చేసేసి.. క్రాక్ తో సూపర్ హిట్ కొట్టిన గోపీచంద్ మలినేనితో సినిమా కూడా అనౌన్స్ చేసేశాడు. ఈ సినిమాని కూడా నెక్ట్స్ మన్త్ నుంచే సెట్స్ మీదకి తీసుకెళ్లాలని.. ఈ సారి కూడా గ్యాప్ తీసుకోకూడదని బాలయ్య డిసైడ్ అయ్యాడని టాక్.

Itlu Amma: సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో ‘ఇట్లు అమ్మ’ ప్రివ్యూ షో!

ట్రిపుల్ ఆర్ స్టార్ట్ చేసిన దగ్గరనుంచి మరో సినిమా వైపు చూడని ఎన్టీఆర్ కూడా కొత్త సినిమా మొదలుపెడుతున్నాడు. కొరటాల శివ డైరెక్షన్లో రెండో సారి సినిమా అనౌన్స్ చేసిన ఎన్టీఆర్.. నెక్ట్స్ మన్త్ నుంచి కొరటాలతో సినిమా స్టార్ట్ చెయ్యడానికి రెడీ అవుతున్నాడు.