నాగార్జున చార్టెట్ విమానం కొంటున్నారా?

టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున రీల్ లైఫ్, రియల్ లైఫ్ ను బ్యాలెన్స్ చేసుకుంటూ విజయవంతంగా తన కెరీర్ కొనసాగిస్తున్నారు. నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. పలు వ్యాపార కార్యకలాపాలు కూడా నిర్వహిస్తున్నారు. తరచుగా బిజీ షెడ్యూల్ తో ఉండే నాగార్జున సొంతంగా చార్టెట్ ఫ్లైట్ కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడట.
చెన్నైలోని తన సోదరుడికి సంబంధించిన ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి అక్కడికి వెళ్లిన నాగార్జునకు చార్టెట్ ఫ్లైట్ ఆలోచన వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే నాగార్జున ఇప్పటికే చార్టెట్ ఫ్లైట్ ను కొన్నారా.. లేదా.. ఫ్లైట్ కు ఆర్డర్ ఇచ్చారా లేదా అనేది తెలియాల్సి ఉంది.