Dasara Movie: దసరా మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరిగేది అప్పుడేనా..?

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘దసరా’ ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తుండగా, పూర్తి రా అండ్ రస్టిక్ మూవీగా ఈ సినిమా వస్తుండటంతో ఈ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తు్న్నారు.

Dasara Movie: దసరా మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరిగేది అప్పుడేనా..?

Buzz On Dasara Movie Pre-Release Event

Dasara Movie: నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘దసరా’ ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తుండగా, పూర్తి రా అండ్ రస్టిక్ మూవీగా ఈ సినిమా వస్తుండటంతో ఈ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తు్న్నారు. ఈ సినిమా పోస్టర్స్, టీజర్, ట్రైలర్లు దసరా మూవీపై అంచనాలను అమాంతం పెంచేశాయి.

Dasara Movie: నాని సినిమాకు అక్కడ ఫుల్ డిమాండ్.. కెరీర్‌లోనే రికార్డు బిజినెస్!

ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌ను భారీ స్థాయిలో చేస్తోన్న చిత్ర యూనిట్, త్వరలోనే ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారట. ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్‌ను మార్చి 25 – మార్చి 27 మధ్యలో ఏదో ఒకరోజున నిర్వహించాలని చూస్తు్న్నారట. తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన దసరా మూవీలో నాని పాత్ర ఊరమాస్‌గా ఉండటంతో ఈ సినిమా ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

Dasara Movie : దసరా రిలీజ్ కూడా సరికొత్త రికార్డు.. అమెరికాలో భారీగా..

ఈ చిత్రంలో అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోండగా, సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమాను మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.