NBK108: బాలయ్య సినిమాలో కాజల్ అలాంటి పాత్రలో కనిపిస్తుందా..?

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రాన్ని అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాలో కాజల్ పాత్రకు సంబంధించి ఓ వార్త నెట్టింట జోరుగా చక్కర్లు కొడుతోంది.

NBK108: బాలయ్య సినిమాలో కాజల్ అలాంటి పాత్రలో కనిపిస్తుందా..?

Buzz On Kajal Role In NBK108 Movie

NBK108: నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రాన్ని అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో బాలయ్య లుక్స్ మునుపెన్నడూ చూడని విధంగా ఉండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు.

NBK108: ఫ్యాన్స్ గెట్ రెడీ.. NBK108 నుండి మరో బిగ్ అప్డేట్.. నిజమేనా?

ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేశాయి. ఇక ఈ సినిమాలో అందాల భామ కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోండటంతో ఈ సినిమాలో ఆమె పాత్ర ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. అయితే, ఈ సినిమాలో కాజల్ పాత్రకు సంబంధించి ఓ వార్త నెట్టింట జోరుగా చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో బాలయ్య 50 ఏళ్ల వయసుగల వ్యక్తిగా కనిపిస్తుండగా, కాజల్ టీచర్ పాత్రలో కనిపిస్తుందట.

NBK108: కొత్త లుక్‌లో కనిపించి స్టన్ చేసిన బాలయ్య

బాలయ్య వ్యక్తిత్వం చూసి, అతడిని ప్రేమిస్తుందట కాజల్. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట జోరుగా చక్కర్లు కొడుతుండటంతో, నిజంగానే ఈ సినిమాలో కాజల్ టీచర్ పాత్రలో నటిస్తుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలయ్య కూతురి పాత్రలో యంగ్ బ్యూటీ శ్రీలీల నటిస్తోండగా, ఈ సినిమాను షౌన్ స్క్రీన్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తోంది.