SSMB28: మహేష్-త్రివిక్రమ్ మూవీ వచ్చేది అప్పుడేనా.. నెట్టింట జోరందుకున్న టాక్!
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కొత్త సినిమాపై ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా రిలీజ్ విషయంలో నెట్టింట తాజాగా ఓ వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది.

Buzz On Mahesh Babu Trivikram SSMB28 Movie Release Date
SSMB28: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన కెరీర్‌లోని 28వ చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో మహేష్ సరికొత్త లుక్‌లో కనిపిస్తుండటంతో ఈ సినిమా నుండి అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.
SSMB28: ఫస్ట్ లుక్ కూడా లేకుండానే భారీ బిజినెస్ చేస్తు్న్న మహేష్ 28వ మూవీ
ఈ సినిమాను త్రివిక్రమ్ తనదైన స్టయిల్‌లో తెరకెక్కిస్తుండటంతో బాక్సాఫీస్ వద్ద మరోసారి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకోవడం ఖాయమని చిత్ర వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కాగా, ఈ సినిమాను ఆగస్టు నెలలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నట్లు తెలిపింది. దీంతో ఈ సినిమా షూటింగ్‌ను అతి త్వరలో ముగించేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. కానీ, ఇప్పుడు ఈ సినిమాను ఆగస్టులో కాకుండా సంక్రాంతి బరిలో రిలీజ్ చేస్తారనే టాక్ వినిపిస్తోంది.
SSMB28: మహేష్ సినిమాలో జయరామ్.. నెట్టింట వైరల్ అవుతోన్న ఫోటో!
అయితే త్రివిక్రమ్ మాత్రం ఈ సినిమాను ఎట్టిపరిస్థితుల్లో దసరా బరిలో రిలీజ్ చేయాలని భావిస్తున్నాడట. దీంతో ఈ సినిమా షూటింగ్‌ను అతి త్వరలోనే ముగించేసి, పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టాలని ఆయన భావిస్తున్నాడు. ఇక ఈ సినిమాను కూడా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కథతో తెరకెక్కిస్తుండగా, అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.