Nani30: నాని మైల్‌స్టోన్ మూవీకి అలాంటి టైటిల్ ఫిక్స్ చేస్తున్నారా..?
నాని కెరీర్ లో 30వ చిత్రంగా వస్తోన్న సినిమాను కొత్త దర్శకుడు శౌర్యువ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా టైటిల్ విషయంలో తాజాగా ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.

Buzz On Nani30 Movie Title Goes Viral
Nani30: నాచురల్ స్టార్ నాని నటించిన రీసెంట్ మూవీ ‘దసరా’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల పూర్తి రా అండ్ రస్టిక్ మూవీగా తెరకెక్కించగా, నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీగా దసరా నిలిచింది. ఇక ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో తన నెక్ట్స్ మూవీని ఇటీవల స్టార్ట్ చేశాడు నాని.
Nani30: తన నెక్ట్స్ మూవీ రిలీజ్ డేట్‌ను లాక్ చేసుకున్న నాని.. ఎప్పుడంటే?
తన కెరీర్‌లో 30వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను కొత్త దర్శకుడు శౌర్యువ్ తెరకెక్కిస్తుండగా, పూర్తి ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమాను చిత్ర యూనిట్ తీర్చిదిద్దుతోంది. ఈ సినిమాలో తండ్రీకూతుళ్ల బంధాన్ని మనకు చాలా ఎమోషనల్‌గా చూపెట్టేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. కాగా, ఈ సినిమాలో అందాల భామ మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోండటంతో ఈ సినిమాపై అంచనాలు నెక్ట్స్ లెవెల్‌లో క్రియేట్ అయ్యాయి.
Nani 30 : నేచురల్ స్టార్ సినిమాకి క్లాప్ కొట్టిన మెగాస్టార్..
ఇక తాజాగా ఈ సినిమా టైటిల్ విషయంలో ఓ క్రేజీ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాకు ‘హాయ్ నాన్న’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. టైటిల్‌లో ఎలాగైనా ‘నాన్న’ అనే పదం వచ్చేలా ఈ చిత్ర టైటిల్ ఉండాలని మేకర్స్ భావిస్తున్నారు. మరి నిజంగానే నాని కెరీర్‌లో మైల్ స్టోన్ మూవీగా వస్తున్న ఈ సినిమాకు ఇలాంటి ఎమోషనల్ టైటిల్‌ను ఫిక్స్ చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.