Unstoppable With NBK: బాలయ్యతో మెగాస్టార్ ఎపిసోడ్.. ఎందుకు వర్క్ఔట్ కాలేదంటే?
బాలయ్యలో మరో కోణాన్ని చూపించిన షో ఆహా అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే. బాలయ్య హోస్ట్ ఏంటి అనే వాళ్ళ నోళ్లు మూయించేసిన ఈ షో తర్వాత బాలయ్య ఏంటో తెలియడమే కాదు.. బాలయ్య క్రేజ్ కూడా అమాంతం..

Unstoppable With Nbk
Unstoppable With NBK: బాలయ్యలో మరో కోణాన్ని చూపించిన షో ఆహా అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే. బాలయ్య హోస్ట్ ఏంటి అనే వాళ్ళ నోళ్లు మూయించేసిన ఈ షో తర్వాత బాలయ్య ఏంటో తెలియడమే కాదు.. బాలయ్య క్రేజ్ కూడా అమాంతం పెరిగిపోయింది అనడంలో ఏమాత్రం డౌట్ అక్కర్లేదు. ఈ టాక్ షో IMDB (ఇంటర్నెట్ మూవీ డేటా బేస్) మన దేశంలో ప్రసారమయ్యే టాక్ షోలపై నిర్వహించిన సర్వేలో 9.7 రేటింగ్‌తో తొలి స్థానంలో నిలిచింది.
Movie Tickets Issue: సినిమా టికెట్ల రేట్లు ఇంకా ఫైనల్ కాలేదు – మంత్రి పేర్ని నాని
ఈ షోలో ప్రతీ వారం ఎవరు గెస్ట్‌గా వస్తారనే విషయం సామాన్యులతో పాటు సెలబ్రిటీలలో కూడా ఆసక్తి కనిపించేది. తొలి సీజన్ లాస్ట్ ఎపిసోడ్ ను సూపర్ స్టార్ మహేష్ బాబుతో కంప్లీట్ చేయగా.. మోహన్ బాబు, మహేశ్ బాబు, అల్లు అర్జున్, రాజమౌళి, విజయ్ దేవరకొండ, నాని, రానాలు సందడి చేశారు. టాలీవుడ్ అగ్రహీరోలు వచ్చిన ఈ షోలో మెగా హీరోల సందడి మాత్రం కరువైంది. ఆహా ఓటీటీ మెగా కాంపౌండ్ లోదే అయినా మెగా హీరోలలో అల్లు అర్జున్ ఒక్కడే కనిపించాడు.
Movie Promotions: సినిమా సంగతేమో కానీ.. ప్రమోషన్ల కోసం కష్టపడుతున్న స్టార్లు!
నిజానికి చిరంజీవిని తొలి సీజన్ లోనే ఆహ్వానించనున్నట్లు అనుకున్నారు. కానీ.. అది కుదరలేదు. దానికి కారణం సమయం అనుకూలించకపోవడమేనట. ఈ షోకు పనిచేసిన దర్శక, రచయిత బీవీఎస్ రవి ఈ విషయాన్ని స్పష్టం చేశాడు. నిజానికి చిరంజీవితో కూడా ఓ ఎపిసోడ్ ప్లాన్ చేశారట. కానీ ఆ సమయంలో బాలయ్య భుజానికి శస్త్రచికిత్స చేయించుకోవడం.. ఆ తర్వాత చిరంజీవి ఒకేసారి మూడు సినిమాలు పట్టాలెక్కించడంతో డేట్లు దొరకడం కష్టమైందని.. రెండో సీజన్లో ఈ మెగా ఎపిసోడ్ ఉంటుందేమోనని ఆశాభావం వ్యక్తం చేశాడు.