C Kalyan : షూటింగ్స్ బంద్ వల్ల ఎవరికీ లాభం లేదు..

తాజాగా ఈ షూటింగ్స్ బంద్ పై ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ వ్యాఖ్యానిస్తూ అదొక అట్టర్ ఫ్లాప్ షో అని వ్యాఖ్యానించారు. మీడియాతో మాట్లాడిన సి.కళ్యాణ్................

C Kalyan : షూటింగ్స్ బంద్ వల్ల ఎవరికీ లాభం లేదు..

C Kalyan sensational comments tollywood shootings strike

C Kalyan :  కొన్ని నెలల క్రితం టాలీవుడ్ లో సమస్యలు ఉన్నాయంటూ, సినిమా మేకింగ్ కాస్ట్ పెరిగిపోయింది అంటూ, ఖర్చులు తగ్గించుకోవడానికి, సినీ పరిశ్రమ సమస్యలని పరిష్కరించుకోవడానికి కొన్ని రోజులు సినిమా షూటింగ్స్ ఆపి మరీ చర్చలు జరిపారు పలువురు సినీ పెద్దలు. అయితే దాని వల్ల ఎవరికీ ఎంత లాభం చేకూరిందో వారికే తెలియాలి.

C Kalyan : సంక్రాంతి సినిమాల విషయంలో ప్రొడ్యూసర్ కౌన్సిల్ చేసింది తప్పు..

తాజాగా ఈ షూటింగ్స్ బంద్ పై ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ వ్యాఖ్యానిస్తూ అదొక అట్టర్ ఫ్లాప్ షో అని వ్యాఖ్యానించారు. మీడియాతో మాట్లాడిన సి.కళ్యాణ్.. ”ఇటీవల సినిమా షూటింగ్స్ ని ఆపేశారు. అదొక అట్టర్ ఫ్లాప్ షో. చిన్న సినిమాల సమస్యలు వీటివల్ల పరిష్కారం అవుతాయేమో అని నేను కూడా దీనికి మద్దతిచ్చాను. కానీ ఈ షూటింగ్స్ బంద్ వల్ల ఏమి జరగదని, ఎవరికీ లాభం లేదని నాలుగు మీటింగ్స్ లోనే అర్థమైంది. చిత్ర పరిశ్రమలో ఉన్న కొన్ని లోపాలని, సమస్యలని గుర్తించి నేను వాళ్ళ ముందు పెట్టాను. కానీ వేటికి కూడా పరిష్కారం దొరకలేదు. సినిమా పరిశ్రమ బతికుంది అంటే చిన్న సినిమాలు, చిన్న నిర్మాతల వల్లే” అని వ్యాఖ్యానించారు. దీంతో నిర్మాత సి కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ లో చర్చగా మారాయి.