క‌రోనా ఎఫెక్ట్: ర‌జనీకాంత్ సినిమా షూటింగ్‌కి బ్రేక్

క‌రోనా ఎఫెక్ట్: ర‌జనీకాంత్ సినిమా షూటింగ్‌కి బ్రేక్

క‌రోనా ఎఫెక్ట్: ర‌జనీకాంత్ సినిమా షూటింగ్‌కి బ్రేక్

కరోనా వైరస్ (కోవిడ్-19) రోజుకో ట్విస్ట్ ఇస్తుంది. ఇప్పటికే ప్రపంచ దేశాలు కరోనా దెబ్బుకు గజగజ వణుకుతున్నాయి. ఈ ఎఫెక్ట్ సినిమా పరిశ్రమపై దారుణంగా ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికే జేమ్స్ బాండ్ సిరీస్‌లో వస్తున్న 25వ సినిమా ‘నో టైం టు డై’, ‘మిషన్ ఇంపాజిబుల్’ సినిమాలు వాయిదా పడ్డాయి. 

ఇప్పుడు కరోనా కారణంగా సూపర్ స్టార్ రజనీకాంత్ ‘అన్నాత్త‌’ సినిమా షూటింగ్ వాయిదా పడింది. న‌య‌న‌తార ప్ర‌ధాన పాత్ర‌లో నటిస్తుండగా మీనా, ఖుష్బు, ప్రకాష్ రాజ్, నివేదా ధామస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘సిరుత్తై’ శివ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తుంది. (తిరుపతిలో కరోనా : రుయాలో చేరిన ఇద్దరు విదేశీయులు)

ఇప్ప‌టి వ‌ర‌కు రెండు షెడ్యూల్స్ పూర్తి చేశారు. మిగ‌తా షెడ్యూల్స్‌ కోల్‌క‌త్తా, పూణేలో ప్లాన్ చేశారు. కట్ చేస్తే క‌రోనా కార‌ణంగా ఈ షెడ్యూల్స్‌ని కాస్త బ్రేక్ త‌ర్వాత హైద‌రాబాద్‌లో పూర్తి చేయాలనే ఆలోచనలో ఉంది మూవీ టీమ్. ఈ ఏడాది చివ‌ర‌లో ‘అన్నాత్త‌’ రిలీజ్ చేసే అవ‌కాశమున్నట్టు సమాచారం. విలన్ పాత్రలో తెలుగు హీరో గోపిచంద్ నటించనున్నాడని వార్తలు వస్తున్నాయి.

ప్రభాస్, పూజా హెగ్డే జంటగా ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా యూరప్‌ షెడ్యూల్ స్టార్ట్ కానుంది. ఇప్పటికే ప్రభాస్ యూరప్ చేరుకున్నాడు. కింగ్ నాగార్జున ‘వైల్డ్ డాగ్’ షూటింగ్ కూడా వాయిదా పడింది.  

(గాంధీలో కరోనా బాధితుడికి మంత్రి ఈటల పరామర్శ, మాస్క్ లేకుండానే..)

×