అర్జున్ రెడ్డితో కేథరిన్ రొమాన్స్

అర్జున్ రెడ్డితో కేథరిన్ రొమాన్స్

అర్జున్ రెడ్డి సినిమాతో మాస్ హీరోగా పేరు తెచ్చుకుని టాలీవుడ్ యువ హీరోగా దూసుకుపోతున్నాడు విజయ్ దేవరకొండ. వరుస సినిమాలతో బిజీబిజీగా సాగిపోతున్న విజయ్.. టాక్సీవాలా చిత్రంతో ఇటీవలే హిట్ కొట్టాడు. భరత్ కమ్మ దర్శకత్వంలో డియర్ కామ్రేడ్ సినిమా చిత్రీకరణలో ఉండగానే మరో సినిమాకు పచ్చజెండా ఊపేశాడు. 

మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, ఉంగరాల రాంబాబు వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన క్రాంతి మాదవ్ కొత్త సినిమాలో ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఇప్పటికే ఈ చిత్రానికి ముగ్గురు హీరోయిన్లను ఎంపిక చేయగా రొమాంటిక్ ఎంటర్‌టైనర్ కావడంతో మరింత గ్లామర్‌ను జోడించాలని భావించింది చిత్ర బృందం. ఈ మేర రాశి ఖన్నా, ఐశ్వర్యా రాజేశ్, ఇసా బెల్లె లీటెతో పాటుగా కేథరిన్ థెరిస్సాను ఎంచుకున్నారు. 

ఈ సినిమాకు కేఏ వల్లభ నిర్మాతగా వ్యవహరించనున్నారు. గోపీ సుందర్ సంగీతం ఇవ్వనున్నారు.