అజయ్ దేవ్‌గన్ 100వ సినిమా ‘తన్హాజీ’ : ది అన్‌సంగ్ వారియర్’

అజయ్ దేవ్‌గన్ 100వ సినిమా ‘తన్హాజీ’ : ది అన్‌సంగ్ వారియర్’

బాలీవుడ్ కథానాయకుడు అజయ్ దేవ్‌గన్ హీరోగా నటిస్తున్న 100వ సినిమా ‘తన్హాజీ’ : ది అన్‌సంగ్ వారియర్’.. సంక్రాంతి కానుకగా 2020 జనవరి 10న గ్రాండ్‌ రిలీజ్..

అజయ్ దేవ్‌గన్ 100వ సినిమా ‘తన్హాజీ’ : ది అన్‌సంగ్ వారియర్’

బాలీవుడ్ కథానాయకుడు అజయ్ దేవ్‌గన్ హీరోగా నటిస్తున్న 100వ సినిమా ‘తన్హాజీ’ : ది అన్‌సంగ్ వారియర్’.. సంక్రాంతి కానుకగా 2020 జనవరి 10న గ్రాండ్‌ రిలీజ్..

బాలీవుడ్ కథానాయకుడు అజయ్ దేవ్‌గన్ హీరోగా 100 సినిమాలు పూర్తి చేస్తున్నారు. ఏ నటుడికైనా కెరీర్‌లో వందవ సినిమా మైలురాయిని టచ్ చేయడం అనేది చాలా ప్రత్యేకం. మూడు దశాబ్దాలుగా హిందీ చిత్ర పరిశ్రమలో హీరోగా కొనసాగుతున్న అజయ్ నటిస్తున్న 100వ సినిమా.. ‘తన్హాజీ’ : ది అన్‌సంగ్ వారియర్’.. సైఫ్ అలీఖాన్, కాజోల్ ప్రధాన పాత్రల్లో.. ఓం రౌత్ దర్శకత్వంలో, అజయ్ దేవ్‌గన్ ఫిలింస్, టీ సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ సినిమా ‘ 3డి టెక్నాలజీలో భారీ బడ్జెట్‌తో, భారీ తారాగణంతో తెరకెక్కుతుంది. శివాజీ మహారాజ్‌తో కలిసి మరాఠా ప్రజల కోసం పోరాడిన సైన్యాధ్యక్షుడైన తన్హాజీ మలుసరే, 1670 వ సంవత్సరంలో జరిగిన సింహగఢ్ యుద్ధంలో కీలక పాత్ర పోషించారు. అటువంటి గొప్ప యోధుడి పాత్రలో అజయ్ దేవగన్ నటిస్తున్నారు. ఈ బయోగ్రఫికల్ పీరియాడిక్ డ్రామా మూవీపై బాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. శరద్ కేల్కర్ ఛత్రపతి శివాజీగా నటిస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్ నటుడు జగపతి బాబు షీలార్ మామ అనే పాత్రలో నటిస్తున్నారు.

Read Also : బాలయ్య మంచి మనసు : మేకప్ వేస్తే హీరో, తీస్తే మోర్ థెన్ ఏ హీరో

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సంక్రాంతి కానుకగా 2020 జనవరి 10న గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నట్లు సినిమా యూనిట్ తెలిపింది. బాలీవుడ్ సంగీత ద్వయం అజయ్-అతుల్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు కేయికో నకహర ఫోటోగ్రఫీని అందిస్తున్నారు ఎడిటింగ్ : ధర్మేంద్ర శర్మ, నిర్మాతలు : అజయ్ దేవ్‌గన్, భూషణ్ కుమార్, కృష్ణన్ కుమార్.
 

×