చిట్టి ముత్యం ఈ సినిమా..కాదని ఎవరన్నా అంటే.. ‘కలర్ ఫోటో’ కు అభినందనల వెల్లువ!

  • Published By: sekhar ,Published On : October 31, 2020 / 07:56 PM IST
చిట్టి ముత్యం ఈ సినిమా..కాదని ఎవరన్నా అంటే.. ‘కలర్ ఫోటో’ కు అభినందనల వెల్లువ!

Colour Photo: యువ నటుడు సుహాస్, చాందిని చౌదరి జంటగా సందీప్ రాజ్ దర్శకత్వంలో అమృత ప్రొడక్షన్స్, లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై రూపొందిన సినిమా.. ‘‘కలర్ ఫోటో’’.. ఇటీవల తెలుగు ఓటీటీ ఆహా ద్వారా ప్రేక్షకులముందుకు వచ్చిన ఈ బ్యూటిఫుల్ లవ్ ఎంటర్‌టైనర్‌కు ఆడియెన్స్ అండ్ ఇండస్ట్రీ వర్గాల వారి నుండి చాలా మంచి స్పందన వస్తోంది.

Image

సుహాస్ నేచురల్ యాక్టింగ్, చాందిని, సుహాస్‌ల కెమిస్ట్రీ, సునీల్ విలనిజం, కాలభైరవ పాటలు, బ్యాగ్రౌండ్ స్కోర్, సందీప్ రాజ్ టేకింగ్‌ను అందరు అప్రిషియేట్ చేస్తున్నారు. సీనియర్ హీరో జగపతి బాబు, మాస్ మహారాజ్ రవితేజ, నేచురల్ స్టార్ నాని, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తదితరులు ఈ సినిమా గురించి మాట్లాడారు. మూవీ టీమ్‌ను అభినందిస్తూ.. మంచి సినిమాను అందరూ చూసి ఆదరించాలని తమ వంతు సపోర్ట్ చేశారు.


రీసెంట్‌గా అల్లు అర్జున్ ‘‘కలర్ ఫోటో’’ సినిమా చూసి యూనిట్ మెంబర్స్‌ను ప్రశంసించారు. ‘‘కలర్ ఫోటో’’ మూవీ స్వీట్ లవ్ స్టోరీ అని.. ఎమోషన్స్, పెర్ఫామెన్సెస్, మ్యూజిక్ ఆకట్టుకున్నాయని.. చాలా రోజుల తర్వాత ఓ మంచి సినిమా చూసినందుకు చాలా సంతోషంగా ఉందని బన్నీ ట్వీట్ చేశారు. ఇంకా చూడని వారుంటే అర్జెంట్‌గా ‘‘కలర్ ఫోటో’’ మూవీ చూసెయ్యండి మరి..