#GetWellSoonSPB.. ప్రార్థనలు చేసిన సినీ ప్రముఖులు..

  • Published By: sekhar ,Published On : August 21, 2020 / 12:40 PM IST
#GetWellSoonSPB.. ప్రార్థనలు చేసిన సినీ ప్రముఖులు..

#GetWellSoonSPB: సుప్రసిద్ధ గాయకులు, గాన గంధర్వుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం కోవిడ్-19తో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. బాలు ప్రస్తుతం చెన్నై ఎంజిఎం హెల్త్ కేర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. బాలు క్షేమంగా తిరిగి రావాలని ప్రపంచ వ్యాప్తంగా సామన్యుల నుంచి సినీ, రాజకీయ ప్రముఖులందరూ ఆయన క్షేమాన్ని కాంక్షిస్తున్నారు. కాగా గురువారం సాయంత్రం సంగీత కళాకారులు, బాలు అభిమానులు ఆయనకోసం ప్రార్థనలు చేశారు. రజనీకాంత్, కమల్ హాసన్ పిలుపు మేరకు ప్రపంచ వ్యాప్తంగా వున్న బాలు అభిమానులు ప్రార్థనలు చేశారు.



తమిళనాడులో బాలు కోలుకోవాలని దీపాలతో ప్రార్థనలు చేశారు. ఇక సోషల్ మీడియాలో, దేశ వ్యాప్తంగా అలాగే ప్రపంచవ్యాప్తంగా #GetWellSoonSPB, #GetWellSoonSPBSIR హ్యాష్‌ట్యాగ్స్ ట్రెండింగ్‌లో ఉన్నాయి. లోకల్ మొదలుకుని నేషనల్ మీడియా వరకు బాలు ఆరోగ్యం గురించి, అభిమానులు చేస్తున్న ప్రార్థనల గురించి ప్రత్యేక కథనాలు ప్రసారం చేస్తున్నాయి.



తమిళ్ మరియు తెలుగు చిత్ర పరిశ్రకుచెందిన పలువురు సినీ ప్రముఖులు బాలు కోసం ప్రార్థనలు చేశారు. దర్శకేద్రుడు కె.రాఘవేంద్రరావు, భారతీరాజా, కె.ఎస్.రవికుమార్, సత్యరాజ్, చిత్ర, ప్రభు, మనో, శివకుమార్, రాధికా శరత్ కుమార్ తదితరులు వీడియో కాల్ ద్వారా సామూహిక ప్రార్థనల్లో పాల్గొని బాలు త్వరగా కోలుకోవాలని సంపూర్ణ ఆరోగ్యంతో తన గొంతు వినిపించాలని వారు ఆకాంక్షించారు.