Bigg Boss Manas : మానస్ కోసం తరలి వస్తున్న తారలు.. మరో వైపు బిగ్ బాస్ మాజీ విన్నర్ కూడా..

మొన్నటి వరకు సింగర్ శ్రీరామ్ చంద్ర కోసం టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలు అంతా ప్రమోషన్ చేశారు. తాజాగా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మానస్ కి సపోర్ట్ గా టీవీ, సినీ ఆర్టిస్టులు ప్రమోషన్.....

Bigg Boss Manas : మానస్ కోసం తరలి వస్తున్న తారలు.. మరో వైపు బిగ్ బాస్ మాజీ విన్నర్ కూడా..

Manas

Bigg Boss Manas :  బిగ్ బాస్ దాదాపు చివరి దశకు వచ్చేసింది. మరో రెండు వారాల్లో బిగ్ బాస్ పూర్తవుతుంది. దీంతో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అంతా కష్టపడి ఆడుతున్నారు. అంతే కాక బయట వీళ్ళ కోసం ప్రమోషన్స్ చేయిస్తున్నారు. సోషల్ మీడియాలో కంటెస్టెంస్ట్ ఫ్యాన్ పేజెస్ తో పాటు సెలబ్రిటీలతో కూడా వీళ్ళకి సపోర్ట్ చేయమని ప్రమోషన్స్ చేయిస్తున్నారు. మొన్నటి వరకు సింగర్ శ్రీరామ్ చంద్ర కోసం టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలు అంతా ప్రమోషన్ చేశారు.

Niharika – Chaitanya : నన్ను పట్టించుకోకుండా నిహారికకు ఎప్పుడూ అదే పని : నిహారిక భర్త

ఇక బిగ్ బాస్ చివరి దశకు రావడంతో కంటెస్టెంస్ట్ అంతా కూడా వేరే సెలబ్రిటీలతో ప్రమోషన్స్ చేయిస్తున్నారు. సోషల్ మీడియాలో బిగ్ బాస్ ప్రమోషన్స్ పీక్స్ లో ఉన్నాయి. తాజాగా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మానస్ కి సపోర్ట్ గా టీవీ, సినీ ఆర్టిస్టులు ప్రమోషన్ చేస్తున్నారు. ఇప్పటికే సింగర్‌ మధుప్రియ, నోయెల్, నటాషా, అదిరే అభి, పూర్ణ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సన, టీవీ ఆర్టిస్ట్ సమీరాతో పాటు మరి కొంత మంది ప్రముఖులు మానస్ కి ఓటు వేయండి అంటూ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. తాజాగా హీరోయిన్ మాళవిక శర్మ కూడా మానస్ కి వోట్ వేయండి అంటూ వీడియో పోస్ట్ చేసింది. వీరితో పాటు మాజీ బిగ్ బాస్ విన్నర్ కౌశల్ కూడా మానస్ కి సపోర్ట్ చేస్తూ వీడియో షేర్ చేశాడు. చివరి దశకి రావడంతో మానస్ తరపున సోషల్ మీడియాలో ప్రమోషన్స్ లో దూకుడు చూపిస్తున్నారు. మరి ఇది ఎంత వరకు వర్క్ అవుట్ అవ్వుద్దో చూడాలి.