CCL 2023 : సెలబ్రిటీ క్రికెట్ లీగ్.. ఏ టీంకి కెప్టెన్ ఎవరో తెలుసా? తెలుగు వారియర్స్ కెప్టెన్ ?

ఈ సారి ఎనిమిది సినీ పరిశ్రమల నుంచి ఎనిమిది టీమ్స్ సెలబ్రిటీ లీగ్ ఆడబోతున్నాయి. తెలుగు వారియర్స్, బెంగాల్ టైగర్స్, భోజ్ పురి దబాంగ్స్, కేరళ స్ట్రైకర్స్, ముంబై హీరోస్, చెన్నై రైనోస్, కర్ణాటక బుల్డోజర్స్, పంజాబ్ దే షేర్ పేర్లతో ఎనిమిది టీంలు ఈ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో పాల్గొనబోతున్నాయి. ఈ మ్యాచుల్లో..............

CCL 2023 : సెలబ్రిటీ క్రికెట్ లీగ్.. ఏ టీంకి కెప్టెన్ ఎవరో తెలుసా? తెలుగు వారియర్స్ కెప్టెన్ ?

Celebrity Cricket League 2023 stars from february 18th teams and captains list

CCL 2023 :  మన దేశంలో సినిమా, క్రికెట్ ఈ రెండూ చాలా మందికి పిచ్చి. ఈ రెండిట్లో ఉండేవాళ్ళకి అభిమానులు కూడా విపరీతంగా ఉంటారు. సినిమా అన్నా, క్రికెట్ అన్నా చూడటానికి అంతా ఎదురుచూస్తారు. అలాంటిది సినిమా వాళ్లు క్రికెట్ ఆడితే ఇక ఆ రేంజ్ వేరు. మన హీరోలు బ్యాట్ పట్టుకొని స్టేడియం లో ఆడుతుంటే అటు సినిమా, ఇటు క్రికెట్ అభిమానులు అంతా కలిసి సందడి చేస్తారు. గతంలో సెలబ్రిటీ క్రికెట్ లీగ్ పేరుతో అన్ని పరిశ్రమల వాళ్ళ మధ్య క్రికెట్ మ్యాచ్ లు నిర్వహించారు. తాజాగా చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ రాబోతుంది.

ఈ సారి ఎనిమిది సినీ పరిశ్రమల నుంచి ఎనిమిది టీమ్స్ సెలబ్రిటీ లీగ్ ఆడబోతున్నాయి. తెలుగు వారియర్స్, బెంగాల్ టైగర్స్, భోజ్ పురి దబాంగ్స్, కేరళ స్ట్రైకర్స్, ముంబై హీరోస్, చెన్నై రైనోస్, కర్ణాటక బుల్డోజర్స్, పంజాబ్ దే షేర్ పేర్లతో ఎనిమిది టీంలు ఈ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో పాల్గొనబోతున్నాయి. ఈ మ్యాచుల్లో ఆయా పరిశ్రమలకి చెందిన హీరోలు, నటులు క్రికెట్ ఆడి అలరించనున్నారు. ఈ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ఫిబ్రవరి 18 నుంచి ప్రారంభమవనుంది. లీగ్ మ్యాచ్ లు లక్నో, జైపూర్, బెంగుళూరు, జోధ్ పూర్, త్రివేండ్రంలో జరగనున్నాయి. సెమీ ఫైనల్స్, ఫైనల్స్ మ్యాచ్ లు మాత్రం హైదరాబాద్ లో జరగనున్నాయి. దీంతో అన్ని సినీ పరిశ్రమల ప్రేక్షకులతో పాటు క్రికెట్ అభిమానులు కూడా ఈ లీగ్ కోసం ఎదురు చూస్తున్నారు.

ముంబై హీరోస్ టీంకి సల్మాన్ ఖాన్ బ్రాండ్‌ అంబాసిడర్‌గా, రితేష్‌ దేశ్‌ముఖ్‌ కెప్టెన్ గా ఉన్నారు.
చెన్నై రైనోస్ టీంకి ఆర్య కెప్టెన్‌గా ఉన్నాడు.
తెలుగు వారియర్స్ టీంకి వెంకటేష్‌ కో ఓనర్‌ గా, అఖిల్‌ కెప్టెన్‌గా ఉన్నారు.
భోజ్‌పురి దబాంగ్స్ టీంకి మనోజ్‌ తివారీ కెప్టెన్ గా ఉన్నాడు.
కేరళ స్ట్రైకర్స్ టీంకి మోహన్‌ లాల్‌ కో ఓనర్‌గా, కుంచాకో బోపన్ కెప్టెన్ గా ఉన్నారు.
బెంగాల్‌ టైగర్స్ టీంకి బోనీ కపూర్‌ కో ఓనర్‌గా, జిసుసేన్‌ గుప్త కెప్టెన్ గా ఉన్నారు.
కర్ణాటక బుల్డోజర్స్ టీంకి కిచ్చ సుదీప్‌ కెప్టెన్ గా ఉన్నాడు.
పంజాబ్‌ దే షేర్‌ టీంకి సోనూసూద్‌ కెప్టెన్‌గా ఉన్నాడు.

Sidharth-Kiara Reception : ముంబైలో గ్రాండ్ గా సిద్దార్థ్-కియారా రిసెప్షన్.. హాజరైన బాలీవుడ్..

అన్ని టీమ్స్ లోను ఆయా సినీ పరిశ్రమకి చెందిన నటులు ఆడనున్నారు. ఇక ఈ మ్యాచ్ లకు అనేకమంది సినీ, టీవీ సెలబ్రిటీలు సైతం హాజరు కానున్నారు. సినీ, క్రికెట్ ప్రేమికులు ఈ మ్యాచ్ ల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.