Celebrity Cricket : సెలబ్రిటీ క్రికెట్.. ఐపీఎల్ తరహాలో 7 ఓవర్ల మ్యాచ్.. సెమీ ఫైనల్, ఫైనల్ ఇవాళే..

 మన దేశంలో సినిమాకి, క్రికెట్ కి వీరాభిమానులు ఉంటారు. కొన్ని సందర్భాలలో ఈ రెండు కలుస్తుంటాయి కూడా. గతంలో అనేక సార్లు సెలబ్రిటీ క్రికెట్ లీగ్స్ జరిగాయి. కానీ గత కొన్ని..............

Celebrity Cricket : సెలబ్రిటీ క్రికెట్.. ఐపీఎల్ తరహాలో 7 ఓవర్ల మ్యాచ్.. సెమీ ఫైనల్, ఫైనల్ ఇవాళే..

Celebrity Cricket :  మన దేశంలో సినిమాకి, క్రికెట్ కి వీరాభిమానులు ఉంటారు. కొన్ని సందర్భాలలో ఈ రెండు కలుస్తుంటాయి కూడా. గతంలో అనేక సార్లు సెలబ్రిటీ క్రికెట్ లీగ్స్ జరిగాయి. కానీ గత కొన్ని సంవత్సరాలుగా సెలబ్రిటీ లీగ్స్ అంతగా జరగట్లేదు. తాజాగా మరోసారి సెలబ్రిటీ లీగ్ జరుగుతుంది. టీవీ, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది సెలబ్రిటీలతో సెలబ్రిటీ సూపర్ 7 పేరుతో ఈ లీగ్ ని నిర్వహిస్తున్నారు.

బ్రిహస్పతి టెక్నాలజీస్, బ్రిహస్పతి ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ సెలబ్రిటీ లీగ్ ని నిర్వహిస్తున్నారు. ఇప్పటికే లీగ్ మ్యాచ్‌లు అయిపోగా ఇవాళ మార్చ్ 25న రాత్రి 7 గంటల నుండి సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ మ్యాచ్‌లలో దాదాపు 50 మందికి పైగా టీవీ, సినిమా సెలబ్రిటీలు పాల్గొంటున్నారు. ఈ మ్యాచ్‌లకి మరింత అందం జోడించడానికి టీవీ, సినిమా నటీమణులు కూడా తోడవుతున్నారు. బ్రిహస్పతి టెక్నాలజీస్ ఎండి రాజశేఖర్, హీరో, నిర్మాత శ్రీరామ్, ఇండియన్ ఫుట్ బాల్ కోచ్ ప్రవీణ్, హీరో, నిర్మాత నంద కిషోర్, స్పోర్ట్ అనలిస్ట్ కార్తీక్, నటుడు, నిర్మాత లోహిత్ కుమార్ ఆధ్వర్యంలో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇక్కడ కేవలం క్రికెట్ మాత్రమే కాకుండా క్రికెట్ తో పాటు సెలబ్రిటీల ఎమోషన్స్, మనోభావాలు కూడా షేర్ చేసుకోనున్నారు.

RRR : ‘ఆర్ఆర్ఆర్’లో హైలెట్స్ ఇవే.. బెనిఫిట్ షో రివ్యూ ఇదే..

సెమీఫైనల్ లో నాలుగు టీమ్స్ పాల్గొననున్నాయి. సమీర్, పవన్ సాయి, శ్రీరామ్, నంద కిషోర్ టీంలు ఫైనల్ ట్రోఫీ కోసం పోటీపడనున్నాయి.

సమీర్ టీంలో బిగ్‌బాస్ మానస్, అలీ తమ్ముడు ఖుయ్యుమ్, భూషణ్, అలెన్, షాని, హితేష్ అవస్థి, మరికొంతమంది ఆర్టిస్టులు ఉన్నారు.

పవన్‌సాయి టీంలో యాంకర్ రవి, నిరుపమ్, కృష్ణ, కల్కి రాజా, వంశి, సరిలేరు నీకెవ్వరు ఫేమ్ రమణ కుమనం మరికొంతమంది ఆర్టిస్టులు ఉన్నారు.

శ్రీరామ్ టీంలో బిగ్‌బాస్ విశ్వా, రాజీవ్, వెంకట్, కౌశిక్, కరం, చక్రి మరికొంతమంది ఆర్టిస్టులు ఉన్నారు.

ఇక నందకిషోర్ టీంలో సింగర్ రేవంత్, భరణి, కళ్యాణ్, సన్నీ, సింగ్ షా, లోహిత్ కుమార్, శ్రీరాజ్ బల్ల మరికొంతమంది ఆర్టిస్టులు ఉన్నారు.

RRR : భ్రమరాంబ థియేటర్లో మెగా ఫ్యామిలీతో కలిసి బెనిఫిట్ షో చూసిన రాజమౌళి, చెర్రీ

 

ఇప్పటికే లీగ్ మ్యాచ్‌లు పూర్తయి ఇవాళ మార్చ్ 25న రాత్రి ఈ సెలబ్రిటీ సూపర్ 7 లీగ్ సెమి ఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ మ్యాచ్ లతో ప్రేక్షకులకి, అభిమానులకి మరింత ఎంటర్టైన్మెంట్ ఇవ్వనున్నారు సినీ, టీవీ సెలబ్రిటీలు. మరి ఈ సెలబ్రిటీ లీగ్ లో ఎవరు విన్ అవుతారో చూడాలి అంటే టాలీవుడ్ నగర్ అనే యూట్యూబ్ ఛానల్‌లో లైవ్ చూడొచ్చు. ఇప్పటికే చేసిన ప్రమోషన్స్ తో ఈ సెలబ్రిటీ సూపర్ 7 క్రికెట్ లీగ్‌కి మంచి స్పందన వస్తుంది. త్వరలో ఇకపై మరిన్ని సెలబ్రిటీ క్రికెట్ లీగ్స్ నిర్వహిస్తామని తెలిపారు నిర్వాహకులు.