Dasara Movie: దసరా మూవీకి 36 కోతలు పెట్టిన సెన్సార్..?

నాని, కీర్తి సురేష్ జంటగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ‘దసరా’ మార్చి 30న రిలీజ్ కానుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు రికర్డుస్థాయిలో ఏకంగా 36 కట్స్ విధించినట్లుగా తెలుస్తోంది.

Dasara Movie: దసరా మూవీకి 36 కోతలు పెట్టిన సెన్సార్..?

Censor Makes 36 Cuts For Dasara Movie

Dasara Movie: ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నాని ‘దసరా’ మూవీ మరో ఐదు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేయగా, పూర్తి రా అండ్ రస్టిక్ కంటెంట్‌తో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోనున్నట్లు చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ సినిమాలో నటీనటుల డీగ్లామర్ లుక్స్ ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి.

Dasara Movie: ప్రీరిలీజ్ ఈవెంట్‌తో దుమ్ములేపేందుకు డేట్, ప్లేస్ ఫిక్స్ చేసిన ‘దసరా’

ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, టీజర్, ట్రైలర్స్, సాంగ్స్ ఈ సినిమాపై నెలకొన్న అంచనాలను అమాంతం పెంచేశాయి. కాగా, ఈ సినిమాకు సెన్సార్ బోర్డు రికార్డు కట్స్ వేసినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాను చూసిన సెన్సార్ బోర్డు ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 36 కోతలు విధించినట్లుగా చిత్ర వర్గాల్లో వార్తలు వినిపిస్తోంది. ఈ సినిమాలోని చాలా సీన్స్ అభ్యంతకరంగా ఉండటంతో వాటిని కట్ చేయాల్సిందిగా సెన్సార్ తెలిపిందట.

Dasara Movie: నాని సినిమాకు అక్కడ ఫుల్ డిమాండ్.. కెరీర్‌లోనే రికార్డు బిజినెస్!

అంతేగాక, చాలా డైలాగులకు బీప్ సౌండ్ పడిందట. మరి ఈ సినిమాలో కంటెంట్ ఏ రేంజ్‌లో ఉండకపోతే, ఇన్ని కట్స్ పడుంటాయా అని అభిమానులు అంటున్నారు. ఇక ఈ సినిమాలో నాని రఫ్ లుక్, కీర్తి సురేష్ లుక్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. సంతోష్ నారాయణన్ అందించిన సంగీతం ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. మార్చి 30న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.