RRR : అమిత్ షాతో RRR టీం భేటీ.. ఆస్కార్ గెలుపు పై చర్చ..

ఈ ఆదివారం తెలంగాణ పర్యటనలో హైదేరాబద్ వస్తున్న కేంద్ర మంత్రి అమిత్ షా.. ఫ్లైట్ దిగిన వెంటనే RRR టీంతో భేటీ కానున్నారు.

RRR : అమిత్ షాతో RRR టీం భేటీ.. ఆస్కార్ గెలుపు పై చర్చ..

Central Minister Amit Shah meets RRR at hyderabad

RRR : దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ (NTR), రామ్ చరణ్ (Ram Charan) కలిసి నటించిన సినిమా RRR. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఎంతటి ప్రభంజనం సృష్టించిందో అందరికి తెలిసిందే. ప్రపంచంలోని సినీ టెక్నీషియన్స్ అంతా ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ (Oscar) ని అందుకొని ప్రపంచ విజేతగా నిలిచింది. ఈ సినిమా కోసం ఎం ఎం కీరవాణి అందించిన నాటు నాటు (Naatu Naatu) సాంగ్ ఆస్కార్ అందుకొని భారతీయ సినీ చరిత్రలో హిస్టరీ క్రియేట్ చేసింది. ఆస్కార్ అందుకున్న తరువాత కూడా RRR క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. ఇంకా పలు చోట్ల ఈ మూవీ మ్యానియా కొనసాగుతూనే ఉంది.

Joe Russo : RRR లాంటి సినిమాలకు మద్దతు ఇస్తాం.. హాలీవుడ్ డైరెక్టర్ కామెంట్స్..

ఇది ఇలా ఉంటే, ఆస్కార్ అందుకున్న RRR టీంని కేంద్రమంత్రి అమిత్ షా (Amit Shah) కలిసి అభినందించనున్నారు. ఈ ఆదివారం (ఏప్రిల్ 23) అమిత్ షా తెలంగాణ పర్యటన ఉంది. ఈ నేపథ్యంలో ఆదివారం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఫ్లైట్ దిగిన అనంతరం అమిత్ షా ముందుగా RRR టీంని కలవనున్నారు. 3:30 గంటలకు ఫ్లైట్ దిగిన అమిత షా.. 4 గంటలకు శంషాబాద్ నోవాటెల్ హోటల్ లో భేటీ కానున్నారు. ఆస్కార్ అవార్డు గెలుచుకున్నందుకు చిత్ర యూనిట్ ని అభినందించనున్నారు. అరగంట పాటు ఈ భేటీ జరగనున్నట్లు సమాచారం.

Chor Nikal Ke Bhaga : అందులో RRR రికార్డ్ బద్దలుకొట్టిన బాలీవుడ్ సినిమా..

అయితే ఈ భేటీలో RRR టీం నుంచి ఎవరెవరు పాల్గొనబోతున్నారు అన్నది తెలియాల్సి ఉంది. ఇప్పటికే RRR ఆస్కార్ అందుకున్న తరువాత రామ్ చరణ్ ఢిల్లీలో అమిత్ షాని కలిసిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పటి వరకు అనేక ఇంటర్నేషనల్ అవార్డ్స్ సొంతం చేసుకున్న RRR.. స్వదేశంలో ఎన్ని నేషనల్ అండ్ ప్రతిష్టాత్మకమైన అవార్డులు అందుకుంటుందో అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.