Movie : హాలీవుడ్ ని ఢీ కొడుతున్న చైనా సినిమా

తాజాగా ఓ చైనా సినిమా హాలీవుడ్ సినిమాలకి ధీటుగా కలెక్షన్స్ కలెక్ట్ చేసింది. ఇంకా కలెక్ట్ చేస్తుంది. చైనాకు చెందిన ‘ది బ్యాటిల్‌ ఎట్‌ లేక్‌ చాంగ్జిన్‌’ చిత్రం భారీగా కలెక్షన్లు

Movie : హాలీవుడ్ ని ఢీ కొడుతున్న చైనా సినిమా

China (1)

Movie :  ప్రపంచం మొత్తం మీద సినిమాలకి ఎక్కువ కలెక్షన్స్ హాలీవుడ్ సినిమాలకే వస్తాయి. హాలీవుడ్ సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతాయి. వాటి బడ్జెట్లు కూడా అంతే భారీగా ఉంటాయి. హాలీవుడ్ సినిమాలు వేల కోట్ల కలెక్షన్స్ సాధిస్తాయి. అప్పుడప్పుడు కొన్ని సినిమాలు హాలీవుడ్ కి ధీటుగా వెళ్తాయి కలెక్షన్స్ పరంగా. ప్రతి విషయంలోనూ అమెరికాతో పోటీ పడుతుంది చైనా. అమెరికా మీద పై చెయ్యి ఉండాలని ప్రయత్నిస్తుంది చైనా. తాజాగా ఓ చైనా సినిమా హాలీవుడ్ సినిమాలకి ధీటుగా కలెక్షన్స్ కలెక్ట్ చేసింది. ఇంకా కలెక్ట్ చేస్తుంది.

Chiranjeevi : కుడి చేతికి సర్జరీ చేశారు.. అభిమానులు ఆందోళన చెందకండి..

చైనాకు చెందిన ‘ది బ్యాటిల్‌ ఎట్‌ లేక్‌ చాంగ్జిన్‌’ చిత్రం భారీగా కలెక్షన్లు సాధిస్తూ రికార్డులు సృష్టిస్తోంది. ఒకప్పుడు జరిగిన కొరియా యుద్ధంలో చైనా సైన్యం అమెరికాను ఓడించిన కథ ఆధారంగా ఈ సినిమాని నిర్మించారు. కేవలం రెండు వారాల్లో ఇది బాక్సాఫీస్‌ వద్ద 633 మిలియన్‌ డాలర్లు వసూలు చేసింది. మన లెక్కల్లో చెప్పాలి అంటే రూ.4.7వేల కోట్లు వసూలు చేసింది ఈ సినిమా. హాలీవుడ్ ‘మార్వెల్స్‌ షాంగ్‌-ఛి’ వసూలు చేసిన మొత్తం కంటే ఇది చాలా ఎక్కువ. చైనాలో అత్యధిక గ్రాస్ కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలుస్తుంది ఈ సినిమా. యుద్ధాల్లో చైనా గొప్పదనాన్ని చూపించేలా ఈ సినిమాని చిత్రీకరించినట్లు తెలుస్తుంది.

Bigg Boss 5 : డ్యాన్సులతో అదరగొట్టిన కంటెస్టెంట్స్.. కూల్ అయిన నాగార్జున

అయితే ఈ చిత్రం ఇంత ఎక్కువ వసూలు చేయడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. ప్రస్తుతం హాలీవుడ్‌ బిగ్ సినిమాలు నో టైమ్‌ టూ డై, డూన్‌ లాంటి మరికొన్ని సినిమాలు ఈ నెలాఖరు వరకు కూడా చైనాలో విడుదల కావు. అంతే కాక ‘ది బ్యాటిల్‌ ఎట్‌ లేక్‌ చాంగ్జిన్’ సినిమా చైనాలో ముఖ్యమైన దినోత్సవాలు ఉన్న సమయంలో విడుదలైంది. అంతేకాక ఈ ఏడాది చైనా కమ్యూనిస్టు పార్టీ 100వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సెలవులు ప్రకటించారు. ఈ సెలవుల సమయంలో ఈ సినిమాని విడుదల చేశారు చిత్ర బృందం. దీంతో ఈ సినిమా ఇంత భారీగా కలెక్షన్స్ సాధించింది. 200 మిలియన్‌ డాలర్ల ఖర్చుతో ఈ సినిమాని తీస్తే ఇప్పటికే 633 మిలియన్ డాలర్స్ వసూలు చేసింది. 1000 డాలర్లకు పరుగులు తీస్తుంది.