Chandoo Mondeti: కార్తికేయ-2 డైరెక్టర్‌తో బాలీవుడ్ స్టార్ హీరో మూవీ..?
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన రీసెంట్ మూవీ ‘కార్తికేయ-2’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన తీరు అద్భుతంగా ఉండటంతో ప్రేక్షకులు ఈ సినిమాకు పట్టం కట్టారు. ఈ సినిమా సక్సెస్ కారణంగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు చందూ మొండేటి రెడీ అవుతున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

Chandoo Mondeti To Work With Hrithik Roshan
Chandoo Mondeti: టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన రీసెంట్ మూవీ ‘కార్తికేయ-2’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన తీరు అద్భుతంగా ఉండటంతో ప్రేక్షకులు ఈ సినిమాకు పట్టం కట్టారు. ఇక ఈ సినిమా ఇండియావైడ్‌గా సూపర్ హిట్‌గా నిలవడంతో, చందూ మొండేటికి అదిరిపోయే గుర్తింపు లభించింది.
కాగా, ఇప్పుడు ఈ సినిమా సక్సెస్ కారణంగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు చందూ మొండేటి రెడీ అవుతున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ డైరెక్టర్ తన నెక్ట్స్ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో చేసేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించాలని చిత్ర నిర్మాతలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాలో హీరోగా హృతిక్ రోషన్ లేదా రణ్‌బీర్ కపూర్‌ను తీసుకునేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
Chandoo Mondeti : నాగార్జునతో ‘విక్రమ్’లాంటి పవర్‌ఫుల్ సినిమా చేస్తాను..
ఈ సినిమాను డైరెక్ట్ చేసే బాధ్యతలు చందూ మొండేటికి ఇవ్వగా, ఆయన ఇప్పటికే ఈ సినిమా కోసం కథను కూడా రెడీ చేసే పనిలో ఉన్నట్లుగా చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. దీంతో చందూ మొండేటి బాలీవుడ్ ఎంట్రీ దాదాపు ఖాయమని సినీ వర్గాల్లో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.