బాలుగారి కోసం.. ప్రపంచవ్యాప్తంగా మహత్తర కార్యక్రమం..

  • Published By: sekhar ,Published On : August 18, 2020 / 02:13 PM IST
బాలుగారి కోసం.. ప్రపంచవ్యాప్తంగా మహత్తర కార్యక్రమం..

సుప్రసిద్ధ గాయకుడు, గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కోవిడ్-19తో బాధపడుతూ హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. బాలు ప్రస్తుతం చెన్నై ఎం.జి.ఎం హెల్త్ కేర్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. బాలు క్షేమంగా తిరిగి రావాలని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. సామన్యుల నుంచి సినీ, రాజకీయ ప్రముఖులందరూ ఆయన క్షేమాన్ని కాంక్షిస్తున్నారు.



ఈ నేపథ్యంలో ప్రముఖ గీత రచయిత చంద్రబోస్, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ తాజాగా ఓ వీడియోను విడుదల చేశారు. బాలుగారి కోసం అందరూ సామూహిక ప్రార్థనలు చేద్దామని పిలుపునిచ్చారు. బాలుగారు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాలుగారి అభిమానులందరూ ఈ రోజు (మంగళవారం) సాయంత్రం ఆరు గంటలకు ప్రార్థన చేయాలని సూచించారు.