Chandrabose : కీరవాణి చెల్లికి గురుదక్షిణగా ఆస్కార్ అందించిన చంద్రబోస్.. ఎందుకో తెలుసా?

ఇటీవల గీత రచయిత చంద్రబోస్ (Chandrabose) ఆస్కార్ అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆ అవార్డుని చంద్రబోస్.. కీరవాణి (M M Keeravani) చెల్లి ఎం ఎం శ్రీలేఖకు గురుదక్షిణగా అందించి కృతజ్ఞతలు తెలియజేశాడు.

Chandrabose : కీరవాణి చెల్లికి గురుదక్షిణగా ఆస్కార్ అందించిన చంద్రబోస్.. ఎందుకో తెలుసా?

Chadrabose gave his oscar to keeravani sister m m srilekha

Chandrabose : రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో ఎన్టీఆర్(NTR), రామ్ చరణ్ (Ram Charan) కలిసి నటించిన RRR చిత్రంలోని నాటు నాటు (Naatu Naatu) సాంగ్ ఆస్కార్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ పాటకి సంగీతం ఎం ఎం కీరవాణి (M M Keeravani) అందించాడు. తెలుగు అక్షరాలతోనే చంద్రబోస్ (Chandrabose) ఈ పాటకి లిరిక్స్ సమకూర్చాడు. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ డాన్స్ కోరియోగ్రఫీ చేశాడు. ఇక ప్రపంచం మొత్తాన్ని ఉర్రూతలూగించిన ఈ పాట ఆస్కార్ అందుకుంటుందని అందరు ఉహించినిదే. దీంతో ప్రపంచవ్యాప్తంగా నాటు నాటు టీంకి అభినందనలు తెలియజేస్తున్నారు.

Naatu Naatu : ఎన్టీఆర్, చరణ్ స్టెప్పులు కంటే.. ఎలాన్ మస్క్ కారులు వేసిన నాటు నాటు స్టెప్పుకి ఫిదా అయిన రాజమౌళి!

కాగా ఆస్కార్ అందుకున్న చంద్రబోస్.. ఆ అవార్డుని కీరవాణి చెల్లికి గురుదక్షిణగా అందించి కృతజ్ఞతలు తెలియజేశాడు. కీరవాణి చెల్లి ఎం ఎం శ్రీలేఖ (M M Srilekha) కూడా సంగీత దర్శకురాలే. ఆమె సంగీత ఆధ్వర్యంలోనే చంద్రబోస్ పరిశ్రమకు పరిచమయ్యాడు. 1995లో శ్రీకాంత్ హీరోగా వచ్చిన సూపర్ హిట్ మూవీ తాజ్ మహల్ సినిమాలో ‘మంచు కొండల్లోన చంద్రమా’ అనే సాంగ్ కి చంద్రబోస్ మొదటిసారి తన కలం కదిపారు. అక్కడి నుంచి మొదలైన చంద్రబోస్ ప్రయాణం నేడు ఆస్కార్ వరకు చేరుకుంది.

ఆస్కార్ అందుకున్న తనకి మొట్ట మొదటి అవకాశం ఇచ్చిన శ్రీలేఖ ఇంటికి వెళ్లి ఆమెకు ఆస్కార్ అందించి కృతజ్ఞతలు తెలియజేశాడు. సినీ సంగీత రంగంలో 25 యేళ్ళు పూర్తి చేసుకున్న ఏకైక మహిళా సంగీత దర్శకురాలు ఎం ఎం శ్రీలేఖని గుర్తు చేశారు. శ్రీలేఖ మాట్లాడుతూ.. SS రాజమౌళి అన్న సినిమా, కీరవాణి అన్న సంగీతం, నేను పరిచయం చేసిన చంద్రబోస్ సాహిత్యం ఆస్కార్ వేదిక మీద ఉన్నప్పుడు చెప్పలేనంత సంతోషం కలిగింది. ఆస్కార్ నాకే వచ్చినంత ఆనందంగా ఉంది. ఇప్పుడు ఆ ఆస్కార్ నా చేతికి అందడం మరింత ఆనందం కలిగిస్తుంది అని ఆమె వ్యాఖ్యానించింది.