Shanmukh-Deepthi: ‘మారడమే అసౌకర్యమే కానీ తప్పదు’.. దీప్తి కామెంట్స్!

యూట్యూబ్ క్యూట్ కపుల్ దీప్తి సునయన-షణ్ముఖ్ జస్వంత్ రిలేషన్ బ్రేకప్ అయినట్లేనా అంటే అవుననే అంటున్నారు వారి ఫ్యాన్స్. సోషల్ మీడియా మొత్తం కోడై కూస్తుంది ఈ బ్రేకప్ గురించి. అంతేకాదు..

Shanmukh-Deepthi: ‘మారడమే అసౌకర్యమే కానీ తప్పదు’.. దీప్తి కామెంట్స్!

Shanmukh Deepthi

Shanmukh-Deepthi: యూట్యూబ్ క్యూట్ కపుల్ దీప్తి సునయన-షణ్ముఖ్ జస్వంత్ రిలేషన్ బ్రేకప్ అయినట్లేనా అంటే అవుననే అంటున్నారు వారి ఫ్యాన్స్. సోషల్ మీడియా మొత్తం కోడై కూస్తుంది ఈ బ్రేకప్ గురించి. అంతేకాదు బంగారం లాంటి జంట మధ్య బిగ్ బాస్ చిచ్చిపెట్టాడని కూడా తిట్టిపోస్తున్నారు ఈ ఇద్దరి ఫ్యాన్స్. బిగ్ బాస్ లో అడుగుపెట్టకముందే షణ్ముఖ్ యూట్యూబ్ స్టార్. సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ కూడా సొంతం. దీప్తి సునయన అంతకు మించిన ఫాలోయింగ్ తో షణ్ముఖ్ జోడిగా మంచి తెచ్చుకుంది.

Nani-Thaman: మ్యూజిక్‌పై నానీ కామెంట్స్.. తమన్ కౌంటర్ ట్వీట్స్?

అయితే.. షణ్ముఖ్ బిగ్ బాస్ లో అడుగుపెట్టాక సిరి హన్మంత్ తో దగ్గరవడం కొంప ముంచింది. సిరి కూడా యూట్యూబ్ లో ఫేమస్ ఆర్టిస్ట్ కాగా.. సిరి శ్రీహన్ తో రిలేషన్ షిప్ లో ఉంది. ఈ ఇద్దరికీ ఎంగేజ్మెంట్ కూడా కాగా ఓ చిన్నారిని దత్తత తీసుకొని పెంచుకుంటున్నారు. అయితే.. సిరి షణ్ముఖ్ బిగ్ బాస్ లో ఫ్రెండ్షిప్ అంటూనే హగ్గులు, ముద్దులతో రెచ్చిపోయారు. చూసే ప్రేక్షకులకు కూడా ఇది పెద్దగా రుచించకపోగా.. సిరి తల్లి కూడా ఇది పద్ధతి కాదని ఇద్దరికీ మొహం మీదే చెప్పేసింది. అయినా వాళ్ళ తీరు పెద్దగా మారలే. చివరికి షణ్ముఖ్ టైటిల్ కూడా ఆ కారణంగానే మిస్ చేసుకున్నానని తానే ఒప్పుకున్నాడు.

Radhe Shyam: స్పీడ్ పెంచుతున్న ప్రమోషన్లు.. ప్రభాస్ కోసం ఫ్యాన్స్ చూపులు!

కాగా, షో కంప్లీట్ అయింది. బయటకి వచ్చాక షణ్ముఖ్-దీప్తి మధ్య బంధం బ్రేకప్ అయిందని టాక్ నడించింది. షణ్ముఖ్ కూడా దీనిపై స్పందించి సోషల్ మీడియాలో తనను బ్లాక్ చేసిందని చెప్పాడు. అప్పటి నుండి దీప్తి చేసే పోస్టులు.. స్టేటస్ లు కూడా ఇదే విషయంపైనే ఉంటున్నాయి. దీప్తి తాజాగా ‘మారడం అసౌకర్యంగా ఉంది.. కానీ తప్పదు (Change is uncomfortable but necessary) అంటూ తన ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ షేర్‌ చేసింది. ఇది చూసిన ఆమె ఫాలోవర్స్‌ దీప్తి నిర్ణయాన్ని స్వాగతిస్తుండగా.. నెటిజన్లు నో డౌట్ ఈ బంధం ఇక బ్రేకప్ అయినట్లేనని ఫిక్సయి పోయారు.