Sankranti 2022: మనసు మార్చుకుంటున్న సంక్రాంతి పందెం కోళ్లు!

రిలీజ్ డేట్స్ మారుతున్నాయి. టైమ్ సెట్ చేసుకుని, మంచి సీజన్ చూసుకుని రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసుకున్న సినిమాలు ఇప్పుడు సైడ్ అయిపోతున్నాయి. సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న ఎఫ్ 3తో..

Sankranti 2022: మనసు మార్చుకుంటున్న సంక్రాంతి పందెం కోళ్లు!

Sankranti 2022 Films

Sankranti 2022: రిలీజ్ డేట్స్ మారుతున్నాయి. టైమ్ సెట్ చేసుకుని, మంచి సీజన్ చూసుకుని రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసుకున్న సినిమాలు ఇప్పుడు సైడ్ అయిపోతున్నాయి. సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న ఎఫ్ 3తో పాటు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు కూడా రిలీజ్ డేట్స్ మార్చుకుంటున్నారా..? సంక్రాంతి నుంచి సైడ్ అయితే.. మరి ఈ స్టార్ హీరోలు వచ్చేదెప్పుడు..?

RRR: ఫైనల్ కాపీ రెడీ.. ‘ఆర్ఆర్ఆర్’ రన్ టైం ఎంతంటే?

రిలీజ్ డేట్స్ మారిపోతున్నాయి. చకచకా సినిమాల్ని కంప్లీట్ చేసి రిలీజ్ కు రెడీ చేసుకున్న సినిమాలు రిలీజ్ డేట్స్ మార్చుకుంటున్నాయి. ఎట్టి పరిస్తితుల్లో సంక్రాంతి బరిలోకి దిగుతామని ఫుల్ కాన్ఫిడెంట్ గా చెప్పిన ఎఫ్ 3.. ఇప్పుడు పెద్ద సినిమాలతో లేనిపోని రిస్క్ ఎందుకుని తప్పుకుంది. వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టీస్టారర్ గా వస్తున్న ఈ సినిమా రిలీజ్ ఫిబ్రవరి 25కి పోస్ట్ పోన్ చేసుకుంది.

Bigg Boss 5: వెక్కి వెక్కి ఏడ్చిన కంటెస్టెంట్లు.. ఒకరి కోసం ఒకరు త్యాగాలు!

2022 సంక్రాంతి సీజన్ ఈ సారి ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ అని తెగ సంబరపడిపోయారు ఫ్యాన్స్. ఆర్ఆర్ఆర్ నుంచి స్టార్ట్ అవుతున్న సంక్రాంతి సందడి వరుసగా జనవరి 12న భీమ్లానాయక్, 13న సర్కారు వారి పాట, 14న రాధేశ్యామ్ తో పాటు మరికొన్ని సినిమాలు లైనప్ చేసుకున్నాయి. అయితే సడెన్ గా ఇప్పుడు సీన్ మొత్తం మారిపోతోంది.

పవన్ కళ్యాణ్, రానా లీడ్ రోల్స్ లో అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ గా తెరకెక్కుతున్న భీమ్లానాయక్ సినిమా జనవరి 12న రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. సాగర్ చంద్ర డైరెక్షన్లో ప్రస్తుతం అల్యూమినియం ఫ్యాక్టరీలో సూపర్ ఫాస్ట్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా మార్చి ఎండ్ కి రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకుందంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి.

Pushpa: తగ్గేదేలే.. ప్రమోషన్లతో పిచ్చెక్కించేస్తున్న పుష్పరాజ్!

సంక్రాంతి సీజన్ లో నెక్ట్స్ లైన్లో ఉన్న మహేష్ బాబు కూడా మనసు మార్చుకుని రిలీజ్ డేట్ గురించి ఆలోచిస్తున్నారని టాలీవుడ్ లో టాక్. ఆల్రెడీ సంక్రాంతి ఫుల్ ప్యాక్డ్ గా ఉండడంతో ఈ టైమ్ లో సినిమా రిలీజ్ చేసి కలెక్షన్లు ఎందుకు తగ్గించుకోవడమని అనుకుంటున్నారు టీమ్. ప్రజెంట్ స్పెయిన్ లో సాంగ్ షూట్ లో ఉన్న మహేష్ బాబు అండ్ యూనిట్.. జనవరి 13న రిలీజ్ చేద్దామనుకున్న సర్కారు వారి పాట సినిమాని ఏప్రిల్ ఎండింగ్ కి పోస్ట్ పోన్ చేసేలా ప్లాన్ చేస్తున్నారని రూమర్ వినిపిస్తోంది.

Deepika Ranveer: సోషల్ మీడియా సాక్షిగా రణ్వీర్‌ను తెగపొగిడేసిన దీపికా!

సంక్రాంతి రేస్ లోకే వద్దామని ముందు అనుకున్న ఆచార్య కూడా ఆ రేస్ నుంచి తప్పుకుంది. ముందు దసరా నుంచి క్రిస్టమస్ అనుకని అక్కడి నుంచి సంక్రాంతికి షిఫ్ట్ అయ్యి లాస్ట్ కి ఫిబ్రవరి 4న రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది ఆచార్య మూవీ. చిరంజీవి, చరణ్ లీడ్ రోల్స్ లో వస్తున్న ఈ సినిమా కూడా మరోసారి రిలీజ్ డేట్ మార్చుకోవచ్చంటూ టాక్ నడుస్తోంది టాలీవుడ్ లో.