Ram Charan : శంకర్ సినిమా నుంచి చరణ్ లుక్ లీక్.. పంచెకట్టుతో సైకిల్ పై..

ఈ సినిమాలో చరణ్ రెండు గెటప్స్ లో కనపడనున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఒక గెటప్, అలాగే 1960ల నాటి గెటప్ అని, రాజకీయాలు నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతుంది అని సమాచారం.

Ram Charan : శంకర్ సినిమా నుంచి చరణ్ లుక్ లీక్.. పంచెకట్టుతో సైకిల్ పై..

Rc 15

Ram Charan :  ఇటీవలే ‘ఆర్ఆర్ఆర్’తో చరణ్ భారీ హిట్ సాధించాడు. ప్రస్తుతం చరణ్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తో. శంకర్ డైరెక్షన్లో చరణ్ ఓ సినిమా చేస్తున్నారు. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్ గా చేస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ని పూర్తి చేసుకుంది. చరణ్ – శంకర్ సినిమా ప్రస్తుతం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూట్ జరుపుకుంటుంది.

అయితే ఈ సినిమాలో చరణ్ రెండు గెటప్స్ లో కనపడనున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఒక గెటప్, అలాగే 1960ల నాటి గెటప్ అని, రాజకీయాలు నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతుంది అని సమాచారం. ఈ సినిమా నుంచి ఒక్క ఫోటో కూడా లీక్ అవ్వకూడదని సినిమా చిత్రీకరణ సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయినా కూడా సినిమా నుంచి ఫోటోలు లీక్ అవుతున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి చరణ్ కొత్త గెటప్ ఒకటి లీక్ అయింది.

Shree Rapaka : ప్రభాస్ పెళ్లయ్యాకే నేను పెళ్లి చేసుకుంటాను అంటున్న ఆర్జీవీ భామ

ఇందులో చరణ్ ఖద్దరు చొక్కా వేసుకొని, పంచె కట్టుకొని సైకిల్ పై తొక్కుకుంటూ వెళ్తున్నాడు. ఈ గెటప్ లో ఫోటో లీక్ అవ్వడంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ గెటప్ లో చరణ్ ని చూసి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ గెటప్ చూసి శంకర్ జెంటిల్ మాన్ తరహాలో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు అని అనుకుంటున్నారు. ఇక ఈ సినిమాకి నిర్మాత దిల్ రాజు భారీగానే ఖర్చు పెడుతున్నారు.