Chatrapathi : భీమిలి బీచ్‌లో ‘ఛత్రపతి’ షూటింగ్..

ఈ సినిమాని హిందీలో తీస్తున్నట్లు ప్రకటించారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఈ సినిమాతో బాలీవుడ్లో ఎంటర్ అవుతున్నాడు. ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్న వివి వినాయక్..........

Chatrapathi : భీమిలి బీచ్‌లో ‘ఛత్రపతి’ షూటింగ్..

Chatrapathi

Chatrapathi :  ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఛత్రపతి’ సినిమా ఏ రేంజ్ లో విజయం సాధించిందో మన అందరికి తెలుసు. ఈ సినిమాతో ప్రభాస్ స్టార్ హీరోగా మారాడు. ఇటీవల ఈ సినిమాని హిందీలో తీస్తున్నట్లు ప్రకటించారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఈ సినిమాతో బాలీవుడ్లో ఎంటర్ అవుతున్నాడు. ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్న వివి వినాయక్ కూడా బాలివుడ్ లో ఈ సినిమాతోనే ఎంట్రీ ఇస్తున్నాడు. ఆల్రెడీ ఈ సినిమా షూటింగ్ కూడా మొదలు పెట్టారు.

Shilpa Choudhary : బయటకొస్తున్న శిల్ప మోసాలు.. మోసపోయిన మరో యువ హీరో

తాజాగా ఈ సినిమా షూటింగ్ ఆంద్రప్రదేశ్ లోని భీమిలి బీచ్‌లో చేస్తున్నారు. బీచ్, ఆ పరిసర ప్రాంతాల్లో ఉండే సన్నివేశాలను నిన్న భీమిలి బీచ్ లో చిత్రీకరణ ప్రారంభించారు. వారం రోజుల పాటు అక్కడ షూటింగ్ నిర్వహించనున్నట్లు డైరెక్టర్ తెలిపారు. షూటింగ్‌లో ఉన్న దర్శకుడు వినాయక్‌ను మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయక్‌ తనకు మంచి మిత్రుడని, స్వయం కృషితో గొప్ప దర్శకునిగా ఎదిగారని, భీమిలిలో షూటింగ్ చేసే ఈ సినిమా కచ్చితంగా మంచి హిట్‌ అవుతుందని అన్నారు. బాలివుడ్ లో కూడా వినాయక్ మంచి పేరు తెచ్చుకుంటారని తెలిపారు.