Chatrapathi : పాకిస్థాన్ వాడ్ని ఇండియాలో హీరోని చేస్తావా? ఛత్రపతి ట్రైలర్ తో VV వినాయక్ పై విమర్శలు..

తాజాగా హిందీ ఛత్రపతి ట్రైలర్ రిలీజ్ అయింది. శ్రీనివాస్ తన రేంజ్ లో బాగానే చేయడానికి ట్రై చేశాడు. హిందీలో ఈ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. అయితే ఈ ట్రైలర్ తో దర్శకుడు VV వినాయక్ పై విమర్శలు వస్తున్నాయి.

Chatrapathi : పాకిస్థాన్ వాడ్ని ఇండియాలో హీరోని చేస్తావా? ఛత్రపతి ట్రైలర్ తో VV వినాయక్ పై విమర్శలు..

Chatrapathi trailer released trolls on VV Vinayak

Chatrapathi :  రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో ప్రభాస్(Prabhas) హీరోగా వచ్చిన ఛత్రపతి(Chatrapathi) సినిమా తెలుగులో(Telugu) బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాతో ప్రభాస్ కి స్టార్ హీరో రేంజ్ వచ్చింది, మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. 2005లో వచ్చిన ఛత్రపతి సినిమా అప్పట్లో ఓ సంచలనం. ఆ సినిమాను 18 ఏళ్ళ తర్వాత ఇప్పుడు హిందీలో(Hindi) రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. బెల్లంకొండ శ్రీనివాస్(Bellamkonda Srinivas) హీరోగా, VV వినాయక్(VV Vinayak) దర్శకత్వంలో హిందీలో ఛత్రపతి పేరుతోనే రీమేక్ చేస్తున్నారు. ఇందులో నుశ్రుత్ భరూచా(Nushrratt Bharuccha) హీరోయిన్ గా నటించింది.

తాజాగా ఈ హిందీ ఛత్రపతి ట్రైలర్ రిలీజ్ అయింది. శ్రీనివాస్ తన రేంజ్ లో బాగానే చేయడానికి ట్రై చేశాడు. హిందీలో ఈ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. అయితే ఈ ట్రైలర్ తో దర్శకుడు VV వినాయక్ పై విమర్శలు వస్తున్నాయి. ఒరిజినల్ ఛత్రపతి సినిమాలో హీరో, అతని చుట్టూ ఉండే జనాలు శ్రీలంక నుంచి ఇండియాకు వచ్చి బతుకుతున్నట్టు చూపించారు. అయితే వాళ్ళు కూడా ఇండియన్స్ అనే చూపించారు.

Chatrapahti Trailer: హిందీ ఛత్రపతి ట్రైలర్.. మాస్ ప్రేక్షకులకు బెల్లంకొండ శ్రీనివాస్ సాలిడ్ ఫీస్ట్..!

తాజాగా రిలీజైన హిందీ ట్రైలర్ లో హీరో, అతని పక్కన ఉండే జనాలు అంతా పాకిస్థాన్ నుంచి వచ్చినట్టు చూపించారు. అయితే స్వతంత్రం ముందు అయితే అంతా ఇండియానే.. అటు, ఇటు జనాలు చాలా మంది మారారు అనుకోవచ్చు. కానీ 1985లో పాకిస్థాన్ నుంచి హీరో, అతని చుట్టూ ఉండే ఆ జనాలు ఇండియాకు వచ్చినట్టు చూపించారు. దీంతో పలువురు నెటిజన్లు ఈ విషయంలో దర్శకుడిని విమర్శిస్తున్నారు. పాకిస్థాన్ నుంచి వచ్చిన వాడ్ని ఇక్కడ ఎలా హీరోని చేస్తావు? అని ఫైర్ అవుతున్నారు. మరి సినిమాలో వాళ్ళు ఇండియన్స్ అన్నదానికి ఏమైనా జస్టిఫికేషన్ ఇస్తారేమో చూడాలి. ఇక ఈ హిందీ ఛత్రపతి సినిమా మే 12న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా బెల్లంకొండ శ్రీనివాస్ కి హిందీలో ఎలాంటి డెబ్యూట్ ఇస్తుందో చూడాలి.