Chay Sam : పిల్లల కోసం ప్లాన్ చేసిన చై-సామ్.. కానీ??

నీలిమ వీరి విడాకుల పై స్పందిస్తూ.. మా నాన్న 'శాకుంత‌లం' సినిమా కోసం సమంత‌ని సంప్ర‌దించ‌గా, ఆమె అప్ప‌టికే సినిమాలు చేయ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించుకుంద‌ట‌. ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తున్నామ‌ని

Chay Sam : పిల్లల కోసం ప్లాన్ చేసిన చై-సామ్.. కానీ??

Sam (1)

Chay Sam :  గత కొద్ది రోజులుగా టాలీవుడ్ లో తెలుగు ప్రేక్షకుల్లో వినిపించే వార్త ఒక్కటే చై-సామ్ విడాకులు. టాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్ ఎందుకు విడిపోయారో ఎవ్వరికి అర్ధం కావట్లేదు. నెటిజన్లు, అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్ల రూపంలో సమంతని, నాగ చైతన్యని ప్రశ్నిస్తున్నారు. సమంత మీద విమర్శలు ఎక్కువగా చేస్తుండటంతో నిన్న సాయంత్రం సమంత ట్రోల్ చేసే వాళ్లందరికీ ఘాటుగా రిప్లై ఇచ్చింది. ఇక వీరి విడాకులపై సెలెబ్రిటీలు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. తాజాగా డైరెక్టర్ గుణశేఖర్ కూతురు ప్రొడ్యూసర్ నీలిమ గుణ స్పందించింది.

స‌మంత‌తో ‘శాకుంత‌లం’ సినిమా చేసిన నిర్మాత నీలిమ గుణ వీరి విడాకుల పై జాతీయ మీడియాలో స్పందించింది. ఇటీవల ఓ జాతీయ ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన నీలిమ వీరి విడాకుల పై స్పందిస్తూ.. మా నాన్న ‘శాకుంత‌లం’ సినిమా కోసం సమంత‌ని సంప్ర‌దించ‌గా, ఆమె అప్ప‌టికే సినిమాలు చేయ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించుకుంద‌ట‌. ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తున్నామ‌ని కొన్ని రోజులు సినిమాల‌కు దూరంగా ఉంటాన‌ని స‌మంత చెప్పింది. కానీ ‘శాకుంతలం’ క‌థ న‌చ్చ‌డంతో, ఇప్పటివరకు సమంత ఒక్క పీరియాడిక్ మూవీ కూడా చేయకపోవడంతో కొన్ని కండీష‌న్స్‌తో ఈ సినిమాకి స‌మంత ఓకే చెప్పింది అని తెలిపారు.

Siddharth: సమంతపై ట్వీట్ కాదు.. సిద్ధార్థ్‌ క్లారిటీ.. కుక్కలతో పోలుస్తూ!

జూలై, ఆగస్ట్‌ కల్లా షూటింగ్ పూర్తిచేయాలని సామ్‌ కోరడంతో మేము ఓకే చెప్పి అలానే ప్లాన్‌ చేసుకున్నాం. స‌మంత ‘శాకుంత‌లం’ త‌ర్వాత సినిమాలు చేయ‌న‌ని, కొన్ని రోజులు గ్యాప్ తీసుకొని పిల్ల‌ల్ని క‌నేందుకు ప్లాన్ చేస్తున్నామ‌ని నాతో కూడా చెప్పింది. కానీ చైతూతో ఇలా విడిపోవ‌డం షాకింగ్‌గా ఉంద‌ని నీలిమ ఇంట‌ర్వ్యూలో తెలిపింది. మరి ఈ గ్యాప్ లో వారిద్దరి మధ్య ఏం జరిగిందో వారికే తెలియాలి.