Shilpashetty – Rajkundra : మరో కేసులో శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా

రాజ్ కుంద్రా, శిల్పాశెట్టిలు రోజుకో వివాదంలో కూరుకుపోతున్నారు. ఇప్పట్లో ఈ వివాదాల నుంచి బయటపడేలా లేరు. తాజాగా ఈ జంటపై ఓ వ్యక్తి 1.51 కోట్ల చీటింగ్ కేసు పెట్టాడు. ముంబై, బాంద్రా

Shilpashetty – Rajkundra : మరో కేసులో శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా

Shilpa Rajkundra

Shilpashetti – Rajkundra :  గతంలో రాజ్ కుంద్రాని పోర్న్ వీడియోల కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం బెయిల్ మీద బయటకి వచ్చారు. ఈ కేసులో ఉన్నప్పుడే చాలా మంది అమ్మాయిలు రాజ్ కుంద్రా మమ్మల్ని మోసం చేసారంటూ కేసులు పెట్టారు. కొంతమంది హీరోయిన్స్ కూడా రాజ్ కుంద్రా, శిల్పాశెట్టి పై తమని భయపెట్టారని, మోసం చేశారని కేసులు పెట్టారు. తాజాగా మరో వ్యక్తి రాజ్ కుంద్రా, శిల్పాశెట్టి పై చీటింగ్ కేసు పెట్టారు.

Samantha : రూటు మార్చి జోరు పెంచిన సమంత.. ‘పుష్ప’లో ఐటెం సాంగ్

రాజ్ కుంద్రా, శిల్పాశెట్టిలు రోజుకో వివాదంలో కూరుకుపోతున్నారు. ఇప్పట్లో ఈ వివాదాల నుంచి బయటపడేలా లేరు. తాజాగా ఈ జంటపై ఓ వ్యక్తి 1.51 కోట్ల చీటింగ్ కేసు పెట్టాడు. ముంబై, బాంద్రా పోలీస్ స్టేషన్‌లో పూణె యువకుడు యష్ బరాయ్ ఈ జంట తనను మోసం చేశారంటూ కేసు నమోదు చేశారు. వీళ్ళిద్దరితో పాటు ఫ్యాషన్ టీవీ ఎండీ కషీఫ్ ఖాన్‌పై కూడా పలు సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

Bigg Boss 5 : శ్రీరామ్ బిగ్ బాస్ కప్పు గెలవాలి : సజ్జనార్

ఫిట్‌నెస్ స్కీమ్‌లో డబ్బు పెట్టుబడి పెట్టమని కాషీఫ్ ఖాన్, శిల్పాశెట్టి, రాజ్ కుంద్రాతో పాటు పలువురు తనను అడిగారని, భారీ లాభాలు వస్తాయని ఆశ చూపారని ఆ యువకుడు ఫిర్యాదులో తెలిపాడు. కానీ అందులో తనకు ఎలాంటి లాభాలు రాకపోవడంతో తన డబ్బు 1.51 కోట్లు ఇచ్చేయాలంటూ అడిగితే బెదిరించారని చెప్పాడు. దీంతో యష్ బరాయ్ పోలీసులను ఆశ్రయించాడు. వీళ్లిద్దరి పై ఇలా చీటింగ్ కేసు బుక్ అవ్వడంతో మరోసారి వార్తల్లో నిలుస్తున్నారు.