Sexual Assault: సినీ నటిపై లైంగిక దాడి.. ఇద్దరు అరెస్ట్

సినీనటిపై అర్ధరాత్రి లైంగిక దాడికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నై వలసరవాక్కుంకు చెందిన ఓ సినీ సహాయ నటి.. భర్త నుంచి విడిపోయి చాలా కాలంగా..

Sexual Assault: సినీ నటిపై లైంగిక దాడి.. ఇద్దరు అరెస్ట్

Sexual Assault

Sexual Assault: సినీనటిపై అర్ధరాత్రి లైంగిక దాడికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నై వలసరవాక్కుంకు చెందిన ఓ సినీ సహాయ నటి.. భర్త నుంచి విడిపోయి చాలా కాలంగా ఏకేఆర్‌ ప్రాంతంలో ఒంటరిగా నివాసం ఉంటోంది. మంగళవారం అర్థరాత్రి సమయంలో ఇద్దరు వ్యక్తులు తన ఇంటిలోకి చొరబడి కత్తి చూపించి దొంగతనానికి పాల్పడ్డారు. నటి వద్ద ఉన్న 10 గ్రాముల బంగారు నగలతో పాటు మరో రూ.50వేలు నగదు చోరీకి పాల్పడ్డారు.

Kollywood Stars: టాలీవుడ్‌లో పాగా వేసేందుకు తమిళ తంబీల ప్లాన్స్!

అలాగే ఇద్దరూ సినీ సహాయ నటిని చంపేస్తామని బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డారు. లైంగిక దాడి సమయంలో వీడియోలు కూడా తీసి చోరీ గురించి కానీ.. రేప్ గురించి కానీ బయటకి చెప్తే వీడియోలు లీక్ చేస్తామని బెదిరించి వెళ్లిపోయారు. సన్నిహితుల చొరవతో నటి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. ఏకేఆర్‌ ప్రాంతంలో సీసీటీవీ కెమెరాల ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు.

Kollywood Hero’s: పెరిగిన బెందిరింపులు.. పాపం కోలీవుడ్ హీరోలు!

చెన్నై రామాపురం ప్రాంతానికి చెందిన కన్నదాసన్‌, ఆయుపాకం ప్రాంతానికి చెందిన సెల్వకుమార్‌ ఈ దారుణానికి పాల్పడినట్లుగా గుర్తించిన పోలీసులు ఇద్దరినీ అరెస్ట్ చేశారు. సహాయ నటి ఇంట్లో చోరీ, లైంగిక దాడి వ్యవహారం తమిళ సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ కాగా.. దారుణానికి పాల్పడిన ఇద్దరినీ కఠినంగా శిక్షించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.