Chennakesava Reddy: బాలయ్య ఊచకోత.. థియేటర్లలో జల్సా చేసిన అభిమానులు!

నందమూరి బాలకృష్ణ నటించిన ‘చెన్నకేశవ రెడ్డి’ చిత్రం రిలీజ్ అయ్యి 20 సంవత్సరాలు పూర్తయ్యింది. ఈ సందర్భంగా ఈ చిత్రాన్ని స్పెషల్ షోల పేరుతో మళ్లీ రీ-రిలీజ్ చేశారు. బాలయ్య సినిమా.. అందులోనూ రీ-రిలీజ్ అనగానే అభిమానులు ఈ సినిమాను చూసేందుకు ఆసక్తిని చూపించారు. అయితే ఈ సినిమాను ఓవర్సీస్‌లో భారీ స్థాయిలో రిలీజ్ చేశారు.

Chennakesava Reddy: బాలయ్య ఊచకోత.. థియేటర్లలో జల్సా చేసిన అభిమానులు!

Chennakesava Reddy Re-Release Creates Record In Overseas

Chennakesava Reddy: నందమూరి బాలకృష్ణ నటించిన ‘చెన్నకేశవ రెడ్డి’ చిత్రం రిలీజ్ అయ్యి 20 సంవత్సరాలు పూర్తయ్యింది. ఈ సినిమాను దర్శకుడు వి.వి.వినాయక్ తెరకెక్కించిన తీరు, సినిమాలోని మాస్ అంశాలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఇక ఈ సినిమాలో బాలయ్య పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు. మాస్‌ను ఈ విధంగా కూడా ఎలివేట్ చేయొచ్చా అని ఈ సినిమా చూసిన వారు అప్పట్లో మాట్లాడుకున్నారు. అంతటి భారీ విజయాన్ని అందుకున్న ‘చెన్నకేశవ రెడ్డి’ చిత్రాన్ని 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రీ-రిలీజ్ చేశారు.

Chennakesava Reddy: ‘పోకిరి’ రికార్డును బద్దలు కొట్టిన చెన్నకేశవ రెడ్డి.. బాలయ్యా.. మజాకా!

బాలయ్య సినిమా.. అందులోనూ రీ-రిలీజ్ అనగానే అభిమానులు ఈ సినిమాను చూసేందుకు ఆసక్తిని చూపించారు. అయితే ఈ సినిమాను ఓవర్సీస్‌లో భారీ స్థాయిలో రిలీజ్ చేశారు. ఒక్క యూఎస్‌లోనే ఈ సినిమాను 38కి పైగా లొకేషన్లలో ఏకంగా 100కు పైగా షోలు వేసినట్లు సమాచారం. ఇక ఈ సినిమా స్పెషల్ స్క్రీనింగ్‌తో యూఎస్‌లో ఏకంగా 40K డాలర్లు కలెక్ట్ చేసినట్లుగా చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

Balakrishna Chennakesava Reddy: బాక్సాఫీస్ భరతం పట్టేందుకు ‘చెన్నకేశవరెడ్డి’ మళ్లీ వస్తున్నాడు!

ఈ సినిమాను చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో థియేటర్లకు వచ్చారు. థియేటర్లలో ఊరమాస్ మేనియాతో వారు చేసిన సందడి అంతా ఇంతా కాదని సినీ వర్గాలు అంటున్నాయి. కాగా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘జల్సా’ రీ-రిలీజ్ కలెక్షన్లను దాటేసి, ఆ రికార్డును బద్ధలు కొట్టాడు చెన్నకేశ రెడ్డి. మొత్తానికి బాలయ్య పవర్‌ఫుల్ సినిమాతో మరోసారి తన సత్తా చాటాడని.. ఓవర్సీస్‌లో అయితే బాలయ్య ఊచకోతకు అభిమానులు ఫిదా అయ్యారని, ఆయన ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు.