Nithiin: మాచర్ల నియోజకవర్గంలో చిల్ అవుతోన్న నితిన్

యంగ్ హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మాచర్ల నియోజకవర్గం’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి క్రేజ్‌ను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా టైటిల్ పోస్టర్‌తోనే ప్రేక్షకుల్లో....

Nithiin: మాచర్ల నియోజకవర్గంలో చిల్ అవుతోన్న నితిన్

Chill Maro Lyrical Song Released From Nithiin Macherla Niyojakavargam

Nithiin: యంగ్ హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మాచర్ల నియోజకవర్గం’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి క్రేజ్‌ను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా టైటిల్ పోస్టర్‌తోనే ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచేసింది. ఇక పూర్తిగా పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్‌తో ఈ సినిమా వస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు.

Nithiin: కెరీర్ బూస్టప్ కోసం నితిన్.. క్రేజీ డైరెక్టర్స్‌తో సినిమాల ప్లాన్!

ఈ సినిమా నుండి తాజాగా ‘చిల్ మారో’ అనే లిరికల్ సాంగ్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. నితిన్ సరికొత్త లుక్‌లో ఈ పాటలో మనకు కనిపించాడు. పూర్తిగా పార్టీ మూడ్‌లో చిల్ అవుతూ నితిన్ వేసిన డ్యాన్స్ స్టెప్స్ ఈ పాటకు హైలైట్‌గా నిలిచాయని చెప్పాలి. ఇక ఈ సినిమాకు మహతి స్వర సాగర్ సంగీతం మరో మేజర్ అసెట్‌గా మారబోతున్నట్లు ఈ పాట వింటే చెప్పేయొచ్చు. కాగా ఈ పాటలో నితిన్‌తో పాటు అందాల భామ కేథరిన్ త్రేజా కూడా కనిపించింది.

Nithiin: మాచర్ల నియోజకవర్గంలో చార్జ్ తీసుకున్న సిద్ధార్థ్ రెడ్డి

నితిన్ కెరీర్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమాలో నితిన్ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని, ఈ సినిమాను ప్రేక్షకులు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక ఈ సినిమాను ఎంఎస్.రాజశేఖర్ రెడ్డి తెరకెక్కిస్తుండగా, నితిన్ హోం బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తోంది. నితిన్ సరసన ఈ సినిమాలో అందాల భామలు కృతి శెట్టి, కేథరిన్ త్రేజాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆగస్టు 12న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.