Stars Vacation: చిల్ అవుతున్న స్టార్స్.. గ్యాప్ దొరికితే ఫారిన్ టూర్!

వీలు దొరికినప్పుడల్లా చిల్ అవుతున్నారు టాలీవుడ్ స్టార్స్. షూటింగ్ గ్యాప్ వస్తే చాలు వెకేషన్ అంటూ ఫారెన్ కి చెక్కేస్తున్నారు. కొవిడ్ తో కోల్పొయిన ఆనందాన్ని తిరిగి పొందాలనో.. కొవిడ్ టైమ్ లో తెలుసుకున్న జీవిత సత్యాన్ని ఫాలో అవ్వాలనో మొత్తానికైతే ఫ్యామిలీతో తెగ టూర్స్ వేసేస్తున్నారు.

Stars Vacation: చిల్ అవుతున్న స్టార్స్.. గ్యాప్ దొరికితే ఫారిన్ టూర్!

Stars Vacation

Stars Vacation: వీలు దొరికినప్పుడల్లా చిల్ అవుతున్నారు టాలీవుడ్ స్టార్స్. షూటింగ్ గ్యాప్ వస్తే చాలు వెకేషన్ అంటూ ఫారెన్ కి చెక్కేస్తున్నారు. కొవిడ్ తో కోల్పొయిన ఆనందాన్ని తిరిగి పొందాలనో.. కొవిడ్ టైమ్ లో తెలుసుకున్న జీవిత సత్యాన్ని ఫాలో అవ్వాలనో మొత్తానికైతే ఫ్యామిలీతో తెగ టూర్స్ వేసేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా లోకేషన్ ఛేంజ్ అన్నది ఎవరంటారా.. అయితే ఈ స్టోరీ చూసేయండి..

Telugu Stars: హిందీ సినిమా వద్దు.. పాన్ ఇండియా ముద్దు.. ఇదే మన హీరోల ఇంట్రెస్ట్!

గ్యాప్ రావాలే కానీ ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయడానికి టాలీవుడ్ స్టార్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వీలైనప్పుడల్లా ఫారెన్ లోకేషన్స్ లో ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు. ఫ్యామిలీకి బాగా టైమ్ కేటాయిస్తున్న బన్నీ.. ఈమధ్య చాలాసార్లు వెకేషన్ కు వెళ్లొచ్చారు. రామ్ చరణ్ సైతం ఉపాసనతో క్వాలిటీ టైమ్ స్పెండ్ చేస్తున్నారు. ట్రిపుల్ ఆర్ గ్యాప్ లో తారక్ సైతం భార్యా పిల్లలలో లాంగ్ ట్రిప్ వేశారు. ఇప్పుడు మహేశ్ బాబు, చిరంజీవి వంతొచ్చింది. వరుస షూటింగ్స్ తో బిజీబిజీగా గడిపిన ఈ హీరోలు ఇప్పుడు సమ్మర్ వెకేషన్ కోసం ఫారెన్ బాటపట్టారు.

Stars Investments: రియల్ ఎస్టేట్స్ నుంచి స్టార్టప్స్ వరకూ.. అంతటా స్టార్స్ పెట్టుబడులే!

ఇల్లు, షూటింగ్ లోకేషన్, ఫ్యామిలీతో విదేశాలకు వెళ్లటం తప్పించి పెద్దగా పార్టీలు, లోకల్ షికారు వంటివి సూపర్ స్టార్ లిస్ట్ లో కనిపించవు. పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్ మహేశ్ బాబు. చిన్న గ్యాప్ దొరికినా చాలు భార్య నమ్రతా.. పిల్లలు గౌతమ్, సితారాతో ఏదో ప్లేస్ కు వెళ్లిపోవడం మహేశ్ కి అలవాటు. ఇప్పుడు కూడా అంతే.. సర్కారు వారి పాట పనులు పూర్తి చేసి.. ప్రమోషన్ మొదలెట్టే గ్యాప్ లో పారిస్ చుట్టేస్తున్నారు మహేశ్ బాబు. రీసెంట్ పారిస్ ట్రిప్ కు సంబంధించిన ఫోటోస్ ను అటు నమ్రత, ఇటు సితార ఇద్దరూ తమ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉన్నారు.

Bollywood Stars: హిట్ టైమ్ ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేస్తున్న బాలీవుడ్ బడా స్టార్స్!

వరుస సినిమాల షూటింగ్‌తో బిజీగా ఉన్న మెగాస్టార్.. ఆచార్య రిలీజ్ తర్వాత కాస్త బ్రేక్‌ ఇచ్చారు. భార్య సురేఖతో కలిసి యూరప్, అమెరికా ట్రిప్ ప్లాన్ చేశారు. కరోనా పాండమిక్‌ తర్వాత ఇదే తొలి ఇంటర్నేషనల్‌ జర్నీ. చాలా రోజుల తర్వాత చిన్న హాలీడే తీసుకొని సురేఖతో కలిసి అమెరికా, యూరప్‌ పర్యటనకు వెళ్తున్నాం. త్వరలోనే అందరిని కలుస్తా అంటూ భార్యతో ఫ్లైట్‌లో దిగిన ఫోటోని ఇన్‌స్టాలో షేర్‌ చేశారు చిరూ.