దొడ్డి దారిలో గెలిచాడు – రాధా రవిపై ధ్వజమెత్తిన చిన్మయి

తమిళ చిత్ర పరిశ్రమ డబ్బింగ్ యూనియన్ ఎన్నికల్లో రాధా రవి గెలవడంపై తీవ్ర ఆరోపణలు చేసిన సింగర్ చిన్మయి..

  • Published By: sekhar ,Published On : February 7, 2020 / 06:16 AM IST
దొడ్డి దారిలో గెలిచాడు – రాధా రవిపై ధ్వజమెత్తిన చిన్మయి

తమిళ చిత్ర పరిశ్రమ డబ్బింగ్ యూనియన్ ఎన్నికల్లో రాధా రవి గెలవడంపై తీవ్ర ఆరోపణలు చేసిన సింగర్ చిన్మయి..

కోలీవుడ్ : దక్షిణ భారత సినీ, టీవీ డబ్బింగ్ యూనియన్ ఎన్నికలు వివాదానికి తెరలేపాయి. ఈ యూనియన్ ఎన్నికలు బుధవారం (ఫిబ్రవరి 5) చెన్నైలో జరిగాయి. ఎన్నికల్లో రాధా రవికి వ్యతిరేకంగా పోటీ చేసిన చిన్మయి నామినేషన్ ఎన్నికల విధానానికి విరుద్ధంగా ఉందని చెప్పి ఎన్నికల అధికారి తిరస్కరించడం తమిళ చిత్ర పరిశ్రమలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. రాధా రవి, చిన్మయిల మధ్య చాలా కాలంగా కోల్డ్ వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. రాధా రవిపై చిన్మయి తీవ్ర స్థాయిలో మీటూ ఆరోపణలు గుప్పించడంతో, ఆమెను డబ్బింగ్ యూనియన్ నుండి తప్పించడం.. చిన్మయి కోర్టును ఆశ్రయించడం.. తెలిసిందే. యూనియన్ ఎన్నికల్లో రాధా రవికి వ్యతిరేకంగా పోటీ చేసిన చిన్మయి నామినేషన్ తిరస్కరించి, అధ్యక్షుడిగా రాధా రవిని ఏకగ్రీవంగా ఎన్నిక చేయడంతో చిన్మయి మీడియా ముందుకొచ్చింది. మరోసారి రాధా రవిపై ఆమె తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసింది.

మీడియాతో మాట్లాడుతూ : ‘‘ప్రజాస్వామ్య దేశంలో జరిగే ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలోనే జరగాలి. అలాంటిది తన నామినేషన్‌ను ఎందుకు తిరష్కరించారనేది వెల్లడించకుండా రాధా రవి విజయం సాధించారని ప్రకటించడంలో అతి పెద్ద కుట్ర ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ ఓడింది నేను మాత్రమే అయితే మాట్లాడేదాన్ని కాదు. 
ఎన్నో ఏళ్లుగా డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ యూనియన్‌లో సభ్యులుగా ఉన్న వందలాది మంది పారితోషకాలు నుంచి తీసుకున్న 10 శాతం డబ్బుతో యూనియన్‌ను నిర్వహిస్తున్నారు, ఆ డబ్బుతోనే  యూనియన్‌కు బిల్డింగ్ కట్టారు. అయితే రూ. 47.5 లక్షలతో స్థలాన్ని, భవనాన్ని కట్టించి కోట్ల రూపాయలకు పైగా డబ్బింగ్‌ కళాకారుల డబ్బును కాజేశారు.

ఆ అవినీతిని బయటకు తీయడానికి నేను పోరాడతాను. ఎదిరించి మాట్లాడితే హత్యాబెదిరింపులకు పాల్పడుతున్నారు.. ఫోన్‌లో దుర్భాషలాడుతున్నారు.. అయినప్పటికీ యూనియన్‌లో రాధారవికి వ్యతిరేకంగా 45 శాతం ఓట్లు పోలయ్యాయి. నేను వారికి వ్యతిరేకంగా మారడంతో ఓటమి ఖాయం కావడంతో, నా నామినేషన్‌ను రిజెక్ట్ చేసి దొడ్డి దారిలో రాధా రవి గెలిచాడు. ఈ ఎన్నికలను వ్యతిరేకిస్తూ నేను న్యాయస్థానాన్ని ఆశ్రయించబోతున్నాను’’ అని చిన్మయి తెలిపారు. ఈ వివాదం ఎంత వరకు వెళ్తుందో చూడాలి.