Chiranieevi: చిరు చిలిపి కోరికలు.. హీరోయిన్స్‌కు గ్లామర్ బిస్కెట్స్!

హీరోయిన్స్ కు బిస్కట్స్ వేస్తూ చిరంజీవి హంగామా చేస్తున్నారు. ఏ ప్రీరిలీజ్ ఈవెంట్ కి వెళ్లినా.. ఆ మూవీ హీరోయిన్ పై చిరూ చేసే కామెంట్స్ హైలెటవుతున్నాయి. అందగత్తెల గ్లామర్ కు ఫిదా..

Chiranieevi: చిరు చిలిపి కోరికలు.. హీరోయిన్స్‌కు గ్లామర్ బిస్కెట్స్!

Chiranieevi

Chiranieevi: హీరోయిన్స్ కు బిస్కట్స్ వేస్తూ చిరంజీవి హంగామా చేస్తున్నారు. ఏ ప్రీరిలీజ్ ఈవెంట్ కి వెళ్లినా.. ఆ మూవీ హీరోయిన్ పై చిరూ చేసే కామెంట్స్ హైలెటవుతున్నాయి. అందగత్తెల గ్లామర్ కు ఫిదా అవుతోన్న మెగాస్టార్.. తనతో ఒక్క సినిమా చేయమని అందరిముందే అడిగేస్తున్నారు.

Chiranjeevi: విక్రాంత్ రోణ కోసం చిరంజీవి, మోహన్ లాల్..!

మిషన్ ఇంపాజిబుల్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి హాట్ కామెంట్స్ చేశారు. తాప్సీతో కలిసి నటించాలనుందన్నారు మెగాస్టార్. ఝుమ్మంది నాదం సినిమా టైమ్ లోనే తాప్సీ గ్లామర్ కు ఫిదా అయ్యారని.. తనతో నటించే ఛాన్స్ మిస్ చేసుకున్నారని చెప్పుకొచ్చారు. అప్పుడెందుకు రాజకీయాల్లోకి వెళ్లానా అని ఫన్ జనరేట్ చేసిన చిరూ.. తాప్సీతో తనకో ప్రాజెక్ట్ సెట్ చేయమని అక్కడే ఉన్న నిర్మాతలను సరదాగా రిక్వెస్ట్ చేశారు.

Chiranjeevi : చరణ్‌కి ఇలా బర్త్‌డే విషెస్ చెప్పడం వింతగా ఉంది

గ్లామర్ బ్యూటీస్ కు బిస్కట్స్ వేయడం చిరంజీవికి కొత్తేమి కాదు. గతంలో చాలామందితో ఇలానే సరాదాగా బిహేవ్ చేశారు మెగాస్టార్. గతేడాది లవ్ స్టోరీ ప్రీరిలీజ్ ఈవెంట్ లో సాయిపల్లవిని విపరీతంగా పొగిడిన చిరూ.. తనతో డాన్స్ చేయాలనుందన్నారు. భోళాశంకర్ మూవీకి సాయిపల్లవి ఒప్పుకోకపోవడమే మంచిదైందని.. చెల్లెలిగా కంటే కూడా తనతో డాన్స్ చేసే హీరోగా ఓ సినిమా చేయాలనుందని తన మనసులో మాట చెప్పేశారు.

Chiranjeevi: నాన్-స్టాప్‌గా కష్టపడుతున్న మెగాస్టార్!

ఉప్పెన ఫంక్షన్ లో కృతిశెట్టికి సూపర్ ఫ్యూచర్ ఉందని.. ఆమె డేట్స్ త్వరగా బుక్ చేసుకోండన్న చిరూ.. ఛలో, గీతగోవిందం, సరిలేరు నీకెవ్వరు ప్రీరిలీజ్ ఫంక్షన్స్ లో రష్మికనూ బాగానే పొగిడారు. సరిలేరు నీకెవ్వరూ ఈవెంట్ లోనే సీనియర్ హీరోయిన్ విజయశాంతిని చూస్తుంటే ఇప్పుడు కూడా గుండె జారిపోతుందన్న ఫన్నీ కామెంట్స్ చేశారు. ఇక ఓ పిట్టకథ సమయంలో అనసూయను చూసి కూడా రొమాంటిక్ గా రెస్పాండ్ అయ్యారు.