‘ఇందువదన’ అంటూ ఇరగదీసిన యంగ్ హీరో.. మెగాస్టార్ మెచ్చుకున్నారు..

‘ఇందువదన’ అంటూ ఇరగదీసిన యంగ్ హీరో.. మెగాస్టార్ మెచ్చుకున్నారు..

Chiranjeei Responce On Indhuvadhana Song Dance

ఈ ఏడాది తన 65వ పుట్టిన రోజుకు మెగాస్టార్ చిరంజీవి అందుకున్న అన్ని బర్త్‌డే గిఫ్ట్‌ల కంటే యువ కథానాయకుడు సుధాకర్ కోమాకుల అందించిన గిఫ్ట్ కాస్త విభిన్నంగానూ ఆకట్టుకునే విధంగానూ ఉంది. చిరంజీవిని మెగాస్టార్‌గా మార్చిన మూవీస్‌లో ఒకటైన ‘ఛాలెంజ్’ చిత్రంలో ఆల్ టైమ్ సూపర్ హిట్ సాంగ్ ‘ఇందువదన కుందరదన.. ఐ లవ్ యు ఓ హారిక… నీ ప్రేమకే జోహరిక’ పాటను.. తన శ్రీమతి హారికతో కలిసి సుధాకర్ కోమాకుల చేశారు.



అయితే ఈ గిఫ్ట్‌పై లేటెస్ట్‌గా స్పందించిన మెగాస్టార్ చిరంజీవి ఆ దంపతులకు ఓ వాయిస్ మెసేజ్ పెట్టారు. సుధాకర్ కోమాకుల చేసిన ‘డాన్స్ రీ-క్రియేషన్’ తన మనసు దోచుకుందని, ఈ సంధర్భంగా మెగాస్టార్ చెప్పుకొచ్చారు. అమెరికాలో ఉన్న ఆ జంట హైదరాబాద్‌లో ఉండి ఉంటే వేరేలా ధన్యవాదాలు చెప్పేవాడినని చిరు అన్నారు. అమెరికాలో ఉన్నారు కాబట్టి వాయిస్ మెసేజ్ ద్వారా చెబుతున్నాను.

మెగాభిమానులతోపాటు సినీ సంగీతాభిమానులందరి మనసులు హోల్‌సేల్‌గా దోచుకుంటున్న ఈ పాట.. తనకు చేర్చాలని తపించిన సుధాకర్ మనస్సు అర్ధం చేసుకోగలనని, సినిమా హీరో కాబట్టి మీరంటే డ్యాన్స్‌లు చేశారు. కానీ సినిమా ఇండస్ట్రీతో సంబంధం లేని హారిక చాలా బాగా నర్తించారని, ఈ విషయంలో హారికకు ఎక్కువ మార్కులు వేస్తున్నానని అన్నారు. జీవితంలో కూడా మీరు సమన్వయంతో మీ జంట లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్‌గా ముందుకు సాగాలి ఆశీర్వదించారు.



https://10tv.in/tamil-actress-meera-mitun-says-she-wants-to-visit-nithyanandas-kailasa-country/
శేఖర్ కమ్ముల ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చిత్రం ద్వారా హీరోగా పరిచయమై.. ‘కుందనపు బొమ్మ, ఉందిలే మంచికాలం ముందు ముందునా, నువ్వు తోపురా’ చిత్రాల ద్వారా తన ప్రతిభను నిరూపించుకున్న సుధాకర్ కోమాకుల ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు.