సొసైటీ కోసం పిల్లలు కూడా వద్దనుకున్నాడు కొరటాల..

దర్శకుడు కొరటాల శివ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించిన మెగాస్టార్ చిరంజీవి..

  • Published By: sekhar ,Published On : April 5, 2020 / 02:26 PM IST
సొసైటీ కోసం పిల్లలు కూడా వద్దనుకున్నాడు కొరటాల..

దర్శకుడు కొరటాల శివ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించిన మెగాస్టార్ చిరంజీవి..

మనిషి జీవితం.. స్వార్థం.. నేను, నా సంపాదన, నా కుటుంబం, నా పిల్లలు.. వాళ్ల పిల్లలు.. ఇలా ఎవరికివారు సెల్ఫిష్‌గా ఆలోచిస్తున్న ఈ రోజుల్లో సమాజం గురించి ఆలోచిస్తూ.. నిస్వార్థంగా పిల్లల్ని కూడా కనకూడదు అని ఆలోచించేవారెవరైనా ఉంటారా? అందులోనూ ఈ జెనరేషన్‌లో.. కచ్చితంగా ఉండరు అనేది అందరి సమాధానం. కానీ తనవంతు సొసైటీకి ఏదో చేయాలనే తపన, తన సినిమాల ద్వారా సమాజంలో ఎంతో కొంత మార్పు తీసుకురావాలని ఆరాటపడే రచయిత, దర్శకుడు కొరటాల శివ మాత్రం ఇలాగే ఆలోచించారు. తనకంటూ స్వార్థం లేని ఓ ప్రత్యేకమైన దారిని ఏర్పరచుకుని అందులోనే ప్రయాణిస్తున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో కొరటాల ‘ఆచార్య’ సినిమా చేస్తున్నారు.

chiranjeevi

కరోనా మహమ్మారిపై సినీ పరిశ్రమ చేస్తున్న పోరాటం, సినీ కార్మికుల కోసం చేపడుతున్న సేవా కార్యక్రమాల గురించి తాజా ఇంటర్వూలో చిరు మాట్లాడుతూ.. ఇంతకుముందు కొరటాల పలు ఇంటర్వూలలో చెప్పిన ఓ అరదైన అద్భుతమైన విషయం గురించి తనదైన శైలిలో స్పందించారు. ‘‘కొర‌టాల శివ సమాజం పట్ల ఎంతో అవగాహన, మేధస్సు ఉన్న వ్యక్తి. జాతీయ, అంతర్జాతీయ విషయాలపై చాలా పట్టుంది తనకి. నానాటికీ దిగజారుతున్న రాజకీయలు, నాయకుల వ్యక్తిత్వాలు, వారి ప్రవర్తన గురించి ఎక్కువ ఆందోళన చెందుతుంటాడు.

koratala siva

డబ్బు తీసుకుని ఓట్లు వేస్తున్న ప్రజల గురించి ఎప్పుడూ వ్యధతో మాట్లాడుతుంటాడు. పిల్లలు పుడితే స్వార్థంతో సమాజానికి ఏమీ చేయలేమని.. బిడ్డలు వద్దనే కఠోర నిర్ణయం తీసుకున్న గొప్ప జంట వారిది. గొప్ప వ్యక్తిత్వం, సామాజిక స్పృహ ఉన్న తనతో సినిమా చేయడం నాకు చాలా గర్వంగా ఉంది. అతని చిత్రాల్లో ఆ భావాలు కనపడతాయి’’ అంటూ చిరు, కొరటాల గురించి చెప్పుకొచ్చారు.

Read Also : దీపాలు వెలిగించిన సెలబ్రిటీలు..

koratala

‘హీరోల తాలుకు ఇమేజ్, దర్శకుల అర్థంలేని తనం, నిర్మాతల వ్యాపార విలువలు, ప్రేక్షకుల తాలుకు అర్థం చేసుకోలేని తనం’ అంటూ త్రివిక్రమ్ ఓ ఫంక్షన్‌లో చెప్పినట్టు.. ‘మిర్చి’, ‘శ్రీమంతుడు’, ‘జనతాగ్యారేజ్’, ‘భరత్ అనే నేను’ సినిమాల్లో కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు సామాజిక అంశాలను ప్రస్తావిస్తూ.. అందర్నీ తన దారిలోకి తీసుకొచ్చారు కొరటాల శివ.. ఆయన సంపాదనలో సగానికిపైగా పలు మఠాలకు, స్వచ్చంద సంస్థలకు ఇచ్చేస్తున్నారు.. స్వార్థంతో పరుగులు తీసే ప్రపంచంలో అలాంటి మనుషుల మధ్య కొరటాల లాంటి వాళ్లు చాలా అరుదుగా ఉంటారనడంలో అతిశయోక్తి లేదు..