Chiranjeevi : పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లపై నో కామెంట్స్ అంటున్న చిరంజీవి..

Chiranjeevi : పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లపై నో కామెంట్స్ అంటున్న చిరంజీవి..

chiru pawan

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాదిని బ్లాక్ బస్టర్ హిట్టుతో ప్రారంభించాడు. సంక్రాంతి కానుకగా విడుదలైన ‘వాల్తేరు వీరయ్య’ బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. కె బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మాస్ మహారాజ్ రవితేజ కూడా నటించాడు. ఈ చిత్రంలో చిరు.. వింటేజ్ లుక్స్, డాన్స్, యాక్షన్ తో ఫ్యాన్స్ కి ట్రీట్ ఇవ్వడంతో ఈ మూవీ ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.200 కోట్ల కలెక్షన్స్ రాబట్టి మెగాస్టార్ స్టామినా ఏంటో మరోసారి బాక్స్ ఆఫీస్ చూపించింది. ఓవర్ సీస్‌లో కూడా ఈ చిత్రం 2.25 మిలియన్స్ కలెక్షన్స్ రాబట్టి రికార్డు సృష్టించింది.

Waltair Veerayya : 2.25 రేటింగ్ ఇచ్చారు.. నేడు 2.25 మిలియన్స్ సాధించింది.. చిరంజీవి!

కాగా ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలు ఇస్తున్న చిరంజీవి.. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల విషయం గురించి అడిగితే నో కామెంట్స్ అంటూ మాట దాటేశాడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కూడా పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లపై విమర్శలు చేస్తుంటారు దాని పై మీ స్పందన ఏంటి అని ప్రశించగా, చిరంజీవి బదులిచ్చాడు. “నిజానిజాలు ప్రజలకి తెలుసు. ఎవరన్నా ఏదన్నా అన్నప్పుడు అది నమ్మాలా, నమ్మకూడదా అనే విచక్షణ వాళ్లకి ఉంది. అలా ఆలోచిస్తారు కాబట్టే ఈరోజు కళ్యాణ్ బాబుకి ఇంతటి ఫాలోయింగ్ ఉంది.

అయినా రాజకీయపరంగా వారు ఏదైనా కామెంట్స్ చేసుకొనివండి. కానీ నేను వాటి గురించి మాట్లాడాను. నేను రాజకీయానికి దూరంగా ఉందాం అనుకుంటున్నా. పాలిటిక్స్ కి దూరంగా ఉంటున్నా అని నా తమ్ముడిని దూరం చేసుకోలేను కదా. వాడు నా తమ్ముడు, ఎక్కడవున్నా నా తమ్ముడే. నాకు బిడ్డ లాంటి వాడు” అంటూ బదులిచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. కాగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కూడా చిరు మాట్లాడుతూ.. పవన్ ని విమర్శించే వాళ్ళు, నా దగ్గరకి వచ్చి నన్ను పలకరిస్తుంటే నాకు ఇబ్బందిగా ఉంటుంది అంటూ చెప్పిన సంగతి తెలిసిందే.