Chiranjeevi: యంగ్ హీరోలకే అందని దూకుడు.. చిరు మెగా లైనప్! Chiranjeevi Aggression with mega lineup, five films on sets

Chiranjeevi: యంగ్ హీరోలకే అందని దూకుడు.. చిరు మెగా లైనప్!

యంగ్ హీరోలకు షాక్ మీద షాకిస్తున్నారు మెగాస్టార్. 152 నుంచి 156వ సినిమా వరకు లైన్ పెట్టిన చిరూ.. ఆ లైనప్ ను పెంచే పనిలోనే ఉన్నారు. ఇంకో రెండు ప్రాజెక్టలను యాడ్ చేసి కౌంట్..

Chiranjeevi: యంగ్ హీరోలకే అందని దూకుడు.. చిరు మెగా లైనప్!

Chiranjeevi: యంగ్ హీరోలకు షాక్ మీద షాకిస్తున్నారు మెగాస్టార్. 152 నుంచి 156వ సినిమా వరకు లైన్ పెట్టిన చిరూ.. ఆ లైనప్ ను పెంచే పనిలోనే ఉన్నారు. ఇంకో రెండు ప్రాజెక్టలను యాడ్ చేసి కౌంట్ పెంచారిప్పుడు. ప్రజెంట్ భారీ బడ్జెట్ అవసరం లేదు.. ఫారెన్ రిచ్ లోకేషన్స్ లో పని లేకుండానే మెగాస్టార్ మెగా సినిమాలతో దూసుకెళ్తున్నారు. కొవిడ్ తో సినిమాలు వాయిద పడుతున్నా చిరూ మాత్రం లైనప్ పెంచేస్తున్నారు. చిరూ 157, చిరూ 158 ప్రాజెక్టలకులకు కూడా రంగం సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. ఎప్పుడైనా అనౌన్స్ మెంట్ రావొచ్చు. చిరూ తన 157వ సినిమాను మారుతితో ఫైనల్ చేశారని తెలుస్తోంది. మారుతి మార్క్ డైరెక్షన్ కి చిరూ యాక్షన్ తోడైతే భీభత్సమే అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.

New Villains: హైలెట్‌గా విలనిజం.. అందుకోసమే స్టైలిష్ స్టార్స్!

మెగా 158 సినిమా డైరెక్ట్ చేయబోయేది అనిల్ రావిపూడి. వరుస హిట్స్ తో ఫన్ డోస్ ఇస్తున్న అనిల్ రావిపూడి ఈమధ్యే చిరూకి కథ వినిపించి ఓకే చేయించుకున్నారు. ప్రస్తుతం ఎప్3 చేస్తున్న అనిల్ రావిపూడి.. తర్వాత బాలకృష్ణతో సెట్స్ పైకెళ్తాడు. ఆ తర్వాతే మెగాస్టార్ ను డైరెక్ట్ చేయబోతున్నాడు. చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబో అంటేనే మెగాభిమానుల్లో అంచనాలు ఓ రేంజ్ కి పెరిగాయి.

Varun Tej-Lavanya Tripathi: వరుణ్‌తో లవ్ ఎఫైర్.. క్లారిటీ ఇచ్చిన లావణ్య!

చరణ్ నటిస్తున్న చిరూ 152వ సినిమా ఆచార్య. ఈ మూవీ ఏప్రిల్ 1న రిలీజ్ కాబోతుంది. తన సినిమాలకు భారీ బడ్జెట్, రిచ్ లోకెషన్స్ వద్దంటున్నా.. సినిమాల్లో స్టార్ కాస్ట్ ఉండేలా చూసుకుంటున్నారు మెగాస్టార్. మూవీలోని కీ క్యారెక్టర్స్, స్పెషల్ రోల్స్ తో ఫ్యాన్య్ ను సర్ ప్రైజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఆచార్యకు రామ్ చరణ్ ఫుల్ సపోర్ట్. కానీ అంతటితో ఆగలేదు. చరణ్ కు జోడీగా పూజా హెగ్డే నటించింది. చిరూ జోడీగా కాజల్ ఉండనే ఉంది. వీళ్లతో పాటూ సోనూసూద్, సంగీత, రెజీనా లాంటి వాళ్లు కూడా ఆచార్యలో హల్చల్ చేయబోతున్నారు.

Mahesh Babu: తగ్గేదేలే.. స్టార్ డైరెక్టర్స్‌ను లైన్‌లో పెట్టేసిన మహేష్!

మోహన్ రాజా డైరెక్షన్ లో చిరూ 153వ ప్రాజెక్ట్ గాడ్ ఫాదర్ చేస్తున్నారు. లూసిఫర్ రీమేక్ గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో కూడా సర్ ప్రైజెస్ చాలానే ఉన్నాయి. పట్టుబట్టి ఓ కీ క్యారెక్టర్ కోసం నయనతారను తీసుకొచ్చారు. ఆమె మెగాస్టార్ కి జోడీగా నటించడం లేదు. నయన్ భర్తగా సత్యదేవ్ కనిపించే ఛాన్స్ ఉంది. ఇక ఇదే గాడ్ ఫాదర్ లో సర్ ప్రైజింగ్ గెస్ట్ గా సల్మాన్ ఖాన్ కనిపించబోతున్నాడు. ఒరిజనల్ లో పృథ్వీరాజ్ సుకుమారన్ చేసిన క్యారెక్టర్ ను సల్మాన్ కోసం రెడీ చేశారు. అలాగే ఇదే మూవీ కోసం చిరూ – సల్మాన్ పాట కోసం బ్రిట్నిస్పియర్స్ తో పాట పాడించేందుకు తమన్ ట్రై చేస్తున్నాడు.

Rakul Preet Singh: కొంటె చూపులతో చంపేస్తున్న రకుల్!

మెగా 154.. భోళాశంకర్ సినిమాకు చాలా మెరుపులనే యాడ్ చేస్తున్నారు. ఈ మూవీలో తమన్నా హీరోయిన్ కాగా కీర్తి సురేశ్ చెల్లెలిగా నటిస్తోంది. మెగా చెల్లెలుగా నటిస్తోన్న కీర్తి కోసం నాగశౌర్యను సెట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. వేదాళం రీమేక్ గా మెహర్ రమేశ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇక ఇందులోని ఐటమ్ సాంగ్ లో స్మాల్ స్క్రీన్ ఫేం రష్మీ స్టెప్పులేయబోతుందనే ప్రచారం జరుగుతుంది. అన్నీ కుదిరితే రష్మీ – చిరూ పాట త్వరలోనే ఫ్లోర్ పైకెళ్లనుంది.

Telugu Heroins: ఆన్ స్క్రీనైనా.. ఆఫ్ స్క్రీనైనా.. పెంచేసిన గ్లామర్ డోస్!

చిరూ – బాబీ కాంబినేషన్లో ఈమధ్యే 155వ ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. ఇందులో హీరోయిన్ గా శృతీ హాసన్ ను ఫైనల్ చేసే అవకాశం ఉంది. చిరూ అండర్ కాప్ గా కనిపించే బాబీ సినిమాలో మాస్ రాజా కూడా నటిస్తారని చెప్తున్నారు. సెకండాఫ్ లో ఎంట్రీ ఇచ్చే రవితేజ కూడా పోలీస్ క్యారెక్టర్ లో దడదడలాడిస్తారని టాక్. ఇక ఈ ప్రాజెక్ట్ లోనే బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీని సెట్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

Deepthi Sunaina: లంగా ఓణీలో దీప్తి సునయన క్యూట్ లుక్స్!

ఆచార్య, గాడ్ ఫాదర్, భోళాశంకర్, బాబీ సినిమాల తర్వాత చిరూ 156వ సినిమాను వెంకీ కుడుములతో లైన్లో పెట్టారు చిరంజీవి. రీసెంట్ గానే ఈ సినిమాను ట్రిపుల్ ఆర్ నిర్మాత డివివి దానయ్య ప్రకటించారు. ఆ తర్వాత మెగా కాంబినేషన్ లో మారుతి, అనిల్ రావిపూడి యాడ్ కాబోతున్నారు. అయితే ఎవరితో చేసినా… మంచి కంటెంట్ ఉన్న స్టోరీలే తీసుకుంటున్నారు… భారీ బడ్జెట్ ప్రాజెక్ట్స్ కి నో చెప్తున్నారు చిరూ. బట్ కండీషన్స్ అప్లై సినిమాలో అవసరమైతే పుష్కలంగా స్టార్స్ ఉండాల్సిందే.

×