కె.విశ్వనాథ్‌ను కలిసిన చిరంజీవి

10TV Telugu News

Chiranjeev Diwali Wishes: ఈ దీపావళి ప్రతిఒక్కరి జీవితంలోని చీకట్లను పారద్రోలి, వెలుగులు విరజిమ్మాలని ఆశిస్తూ.. సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా తెలుగు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. ఈ పండుగ పర్వదినాన మెగాస్టార్ చిరంజీవి సతీసమేతంగా కళాతపస్వి కె.విశ్వనాథ్ గారిని కలిసి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.

Image

ImageImageఅనంతరం చిరు, శ్రీమతి సురేఖ.. విశ్వనాథ్ దంపతుల ఆశీర్వాదం తీసుకున్నారు. విశ్వనాథ్, చిరుతో ఆప్యాయంగా మాట్లాడారు. విశ్వనాథ్ ఆరోగ్యపరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు చిరంజీవి. దీనికి సంబంధించిన వీడియో మరియు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.