Chiru – Balayya : చిరు దారిలో బాలయ్య.. నిజమేనా?

టాలీవుడ్ బడా హీరోలు చిరంజీవి, బాలకృష్ణ ఈ ఏడాదిని చాలా గ్రాండ్ గా మొదలు పెట్టారు. వీళ్లిద్దరు వాళ్ళ తదుపరి సినిమాలను ఇప్పటికే ప్రారభించిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరు హీరోలు ఒకే దారిలో పయనించబోతున్నారని తెలుస్తుంది.

Chiru – Balayya : చిరు దారిలో బాలయ్య.. నిజమేనా?

chiranjeevi and balakrishna

Chiru – Balayya : టాలీవుడ్ బడా హీరోలు చిరంజీవి, బాలకృష్ణ ఈ ఏడాదిని చాలా గ్రాండ్ గా మొదలు పెట్టారు. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలతో సంక్రాంతి బరిలో నిలిచిన వీరిద్దరూ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. అంతేకాదు ఈ సినిమాల్లో వింటేజ్ లుక్స్ తో, యాక్షన్ తో ప్రేక్షకులకు ఒక్కప్పటి చిరు, బాలయ్యని గుర్తుకు చేశారు. కాగా ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరు హీరోలు ఒకే దారిలో పయనించబోతున్నారని తెలుస్తుంది. వీళ్లిద్దరు వాళ్ళ తదుపరి సినిమాలను ఇప్పటికే ప్రారభించిన సంగతి తెలిసిందే.

Chiranjeevi : ఆ డైరెక్టర్ కి మెగాస్టార్ హ్యాట్రిక్ సినిమా ఇస్తాడా?

చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న భోళాశంకర్ షూటింగ్ శరవేగంగా సాగుతుంది. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ తమిళ హిట్ మూవీ ‘వేదాళం’కి రీమేక్ గా వస్తుంది. కాగా ఈ మూవీ కలకత్తా బ్యాక్ డ్రాప్ లో ఉండనుంది. గతంలో చిరంజీవి కలకత్తా బ్యాక్ డ్రాప్ లో ‘చూడాలని ఉంది’ సినిమా చేశాడు. ఇక ఆ సినిమాలో మణిశర్మ ఇచ్చిన పాటలు ఎవర్ గ్రీన్. ముఖ్యంగా ‘రామ చిలకమ్మా’ సాంగ్. ఈ పాటని ఇప్పుడు భోళాశంకర్ లో రీమేక్ చేస్తున్నట్లు సమాచారం. భోళాశంకర్ కి మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ మ్యూజిక్ డైరెక్టర్ గా చేస్తున్నాడు.

Balakrishna-Vijayasai Reddy : తారకరత్న కోసం.. అన్నీ తామే అయి దగ్గరుండి చూసుకుంటున్న బాలకృష్ణ, విజయసాయి రెడ్డి..

ఇప్పుడు చిరు లాగానే బాలయ్య కూడా తన పాటని తానే రీమేక్ చేయబోతున్నాడట. బాలకృష్ణ సూపర్ హిట్ మూవీ సమరసింహా రెడ్డి సినిమాలో మణిశర్మ సంగీత దర్శకత్వంలో వచ్చిన ‘అందాల ఆడబొమ్మ’ సాంగ్ ని NBK108 లో రీమేక్ చేయబోతున్నారని సమాచారం. అయితే ఈ రీమేక్ లు పై చిత్ర యూనిట్ లు నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. కాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న NBK108 మూవీ తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతున్నట్లు ఇప్పటికే తెలియజేశారు. ఎస్ ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరు నటిస్తున్నారు అనేది కూడా క్లారిటీ రావాల్సి ఉంది.