Chiranjeevi : మెగాస్టార్ స్పీడ్ మామూలుగా లేదుగా..!

సీనియర్ అండ్ యంగ్ హీరోలతో పాటు మెగా ఫ్యాన్స్ సైతం ఆశ్చర్యపోయేలా క్రేజీ కాంబినేషన్స్‌తో సినిమాలు సైన్ చేస్తున్నారు..

10TV Telugu News

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీలో స్పీడ్ పెంచేశారు. తోటి సీనియర్ అండ్ యంగ్ హీరోలతో పాటు మెగా ఫ్యాన్స్ సైతం ఆశ్చర్యపోయేలా క్రేజీ కాంబినేషన్స్‌తో సినిమాలు సైన్ చేస్తున్నారు. మెగాస్టార్ మూవీస్ లైనప్ మామూలుగా లేదసలు.

Ponnabalam : చిరంజీవి అన్నయ్యా.. మీ సాయం మరువలేను – నటుడు పొన్నాంబళం..

మరికొద్ది రోజుల్లో కొరటాలతో చేస్తున్న ‘ఆచార్య’ కి గుమ్మడికాయ కొట్టబోతున్నారు. ఆగస్టు మూడో వారం నుండి ‘లూసీఫర్’ రీమేక్ షూటింగ్‌కి అటెండ్ కాబోతున్నారు. తర్వాత కొద్దిరోజులకే మరో సినిమాను పట్టాలెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఆగస్టు 13 నుండి షూటింగ్ స్టార్ట్ చెయ్యనున్నారని తెలుస్తోంది.

Acharya : ‘ఆచార్య’లో శ్రీశ్రీ పలుకులు.. టార్గెట్ నేషనల్ అవార్డ్..?

‘పవర్’, ‘సర్దార్ గబ్బర్ సింగ్’, ‘జై లవ కుశ’, ‘వెంకీమామ’ సినిమాలతో ఆకట్టుకున్న యంగ్ డైరెక్టర్ బాబీతో మైత్రీ మూవీస్ బ్యానర్‌లో చిరు ఓ మూవీ చెయ్యబోతున్న సంగతి తెలిసిందే. దసరా నుండి ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారు మెగాస్టార్.

Megastar Chiranjeevi : మెస్మరైజింగ్ మెగా అప్‌డేట్.. చరణ్, శంకర్ సినిమాలో చిరు..

10TV Telugu News