Chiranjeevi : ఆ డైరెక్టర్ కి మెగాస్టార్ హ్యాట్రిక్ సినిమా ఇస్తాడా?

ఇటీవలే మెగాస్టార్ వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ప్రస్తుతం చిరంజీవి ‘భోళాశంకర్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత వెంకీ కుడుముల దర్శకత్వంలో ఒక సినిమా ఉన్నా అది ఇప్పుడు డైలమాలోనే ఉంది. దీంతో చిరంజీవి నెక్స్ట్ సినిమా...............

Chiranjeevi : ఆ డైరెక్టర్ కి మెగాస్టార్ హ్యాట్రిక్ సినిమా ఇస్తాడా?

Chiranjeevi and VV Vinayak combination movie will happen talk in tollywood

Chiranjeevi :  టాలీవుడ్ లో యాక్షన్ డైరెక్టర్ వివి వినాయక్ సినిమా వచ్చి చాలా రోజులవుతోంది. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ తో హిందీ ఛత్రపతి రీమేక్ పనుల్లో బిజీగా ఉన్నాడు వినాయక్. అయితే తన నెక్స్ట్ మూవీని మళ్ళీ బాస్ మెగాస్టార్ తోనే తీయబోతున్నట్టు సమాచారం. టాలీవుడ్ లో వివి వినాయక్ చివరగా చేసిన సినిమా 2018లో ‘ఇంటిలిజెంట్’. సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమా డిజాస్టర్ అయింది. అప్పటి నుంచి వినాయక్ మరో తెలుగు సినిమా చేయలేదు. ఇప్పుడు ఛత్రపతి హిందీ రీమేక్ సినిమా తర్వాత వినాయక్ మళ్ళీ చిరంజీవితో సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో ఠాగూర్, ఖైదీ నెం.150 సినిమాలు వచ్చి మంచి విజయం సాధించాయి.

వినాయక్ ఇప్పటికే చిరుకి ఒక స్టోరీ లైన్ చెప్పగా చిరు దాని మీద వర్కౌట్ చేయమన్నట్టు తెలుస్తోంది. ఇటీవలే మెగాస్టార్ వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ప్రస్తుతం చిరంజీవి ‘భోళాశంకర్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత వెంకీ కుడుముల దర్శకత్వంలో ఒక సినిమా ఉన్నా అది ఇప్పుడు డైలమాలోనే ఉంది. దీంతో చిరంజీవి నెక్స్ట్ సినిమా ఇంకా అధికారికంగా ఏది ప్రకటించలేదు. చిరు భోళాశంకర్ రిలీజయ్యేలోపు వినాయక్ కూడా హిందీ ఛత్రపతి పూర్తి చేసుకొని వస్తాడని సమాచారం.

Akhil Akkineni : లవర్ బాయ్ అఖిల్ ఏజెంట్ తో యాక్షన్ హీరో అవుతాడా??

దీంతో చిరు-వినాయక్ కాంబినేషన్ లో మూడో సినిమా ఉంటుందని టాలీవుడ్ లో టాక్ నడుస్తుంది. అయితే గతంలో వినాయక్ దర్శకత్వంలో చిరు హీరోగా వచ్చిన రెండు సినిమాలు కూడా తమిళ రీమేక్ సినిమాలే. అయితే ఈ సారి వినాయక్ సొంత కథతో రాబోతున్నట్టు, దీనిపై ఛత్రపతి సినిమా పనులు అయిపోయాక కూర్చొని వర్క్ చేయనున్నట్టు సమాచారం. ఇదే నిజమైతే ఈ సినిమాపై ముందునుంచే అంచనాలు నెలకొనడం ఖాయం. మరి చిరు-వినాయక్ హ్యాట్రిక్ హిట్ కొడతారేమో చూడాలి. ఈ కాంబో కోసం మెగా అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు.