Chiranjeevi : మరో సినిమాని లైన్ లో పెట్టిన మెగాస్టార్.. మారుతితో అంటూ హింట్..

తాజాగా మరో సినిమాని అనౌన్స్ చేశారు చిరు. పక్కా కమర్షియల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ.. ''డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో నేను హీరోగా యూవీ క్రియేషన్స్‌లో...........

Chiranjeevi : మరో సినిమాని లైన్ లో పెట్టిన మెగాస్టార్.. మారుతితో అంటూ హింట్..

Maruthi

Chiranjeevi :  గోపీచంద్, రాశిఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా పక్కా కమర్షియల్. ఈ సినిమా జూలై 1న థియేటర్స్ లోకి రానుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లో జరగగా ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఈ ఈవెంట్ లో చిరంజీవి మాట్లాడుతూ తన లిస్ట్ లో ఉన్న మరో సినిమాని అనౌన్స్ చేశారు.

 

66 ఏళ్ళ వయసులో యువ హీరోలకి పోటీ ఇస్తూ ఫుల్ జోష్ లో వరుస సినిమాలని అనౌన్స్ చేస్తున్నారు మెగాస్టార్. ఇప్పటికే చిరంజీవి మూడు సినిమాల షూటింగ్స్ కి ఒకేసారి పాల్గొంటున్నారు. మోహనరాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్, మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళాశంకర్, బాబీ దర్శకత్వంలో మెగా154 సినిమాలు ప్రస్తుతం సెట్స్ మీద ఉన్నాయి. ఇవి కాకుండా వెంకీ కుడుములతో ఒక సినిమా అనౌన్స్ చేశారు. గతంలో త్రివిక్రమ్, హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా భవిష్యత్తులో సినిమాలు ఉండొచ్చు అన్నట్టు తెలిపారు.

Chiranjeevi : ఆయన నా సీనియర్.. ఆయనతో సినిమా అనుకున్నాం కానీ కుదరలేదు..

తాజాగా మరో సినిమాని అనౌన్స్ చేశారు చిరు. పక్కా కమర్షియల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ.. ”డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో నేను హీరోగా యూవీ క్రియేషన్స్‌లో వంశీ, విక్కీలతో సినిమా ఉంటుంది” అని తెలిపారు. దీంతో మెగాస్టార్ మరో సినిమాకి పచ్చ జెండా ఊపినట్టు తెలిసిపోతుంది. అయితే ఈ సినిమా పట్టాలెక్కేసరికి చాలా టైం పడుతుంది. ఇలా ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క వరుస సినిమాలు అనౌన్స్ చేస్తూ యువ హీరోలకి పోటీ ఇస్తున్నారు మెగాస్టార్.