Chiranjeevi : 'సఖి'కు గుడ్ లక్ చెప్పడానికి మెగాస్టార్ | Chiranjeevi as chief guest for gud luck sakhi movie pre release event

Chiranjeevi : ‘సఖి’కు గుడ్ లక్ చెప్పడానికి మెగాస్టార్

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘గుడ్ లక్ సఖి’. జగపతి బాబు, ఆది పినిశెట్టి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇవాళ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించబోతున్నారు.....

Chiranjeevi : ‘సఖి’కు గుడ్ లక్ చెప్పడానికి మెగాస్టార్

Gud Luck Sakhi :  కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘గుడ్ లక్ సఖి’. జగపతి బాబు, ఆది పినిశెట్టి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా కరోనాతో పాటు కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడుతూ వస్తుంది. ఇటీవల న్యూ ఇయర్ కి విడుదల చేస్తామని ప్రకటించినా అప్పుడు కూడా వాయిదా పడింది. తాజాగా తెలుగు, తమిళ్ భాషల్లో తెరకెక్కిన ‘గుడ్ లక్ సఖి’ సినిమాని జనవరి 28న విడుదల చేయబోతున్నారు. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు.

Chiaranjeevi : పద్మ అవార్డు విజేతలకు చిరంజీవి ప్రత్యేక అభినందనలు..

ఇవాళ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించబోతున్నారు. హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్ లో ఇవాళ సాయంత్రం ఆరు గంటల నుంచి ‘గుడ్ లక్ సఖి’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించబోతున్నారు. ఈ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా మెగాస్టార్ చిరంజీవి రానున్నారు. సినిమా చిత్ర బృందం అంతా పాల్గొననున్నారు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో. చిరంజీవి ముఖ్య అతిధిగా విచ్చేసి ‘గుడ్ లక్ సఖి’ సినిమాకి విషెష్ చెప్పి ప్రమోట్ చేయనున్నారు. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో సాగే ఈ సినిమా కోసం కీర్తి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

 

 

×